హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్. 2025 టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఆయా పరీక్ష తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరతగతి పరీక్షలు జరగనున్నాయి. అలాగే.. ఈసారి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఈ https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తమ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.

ఇప్పటికే ఇంటర్, సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు
ఎండాకాలం వచ్చేసింది. పరీక్షల కాలం ప్రారంభమైంది. మార్చి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే ఇంటర్, సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. త్వరలో టెన్త్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. సక్రమంగా ఆహారం తీసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఒకవైపు పరీక్షలు.. మరోవైపు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఎండ కారణంగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. వడదెబ్బ బారిన పడితే నీరసంతోపాటు దాని ప్రభావం మెదడుపైనా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్..
.మార్చి 21 – ఫస్ట్ లాంగ్వేజ్
.మార్చి 22 – సెకండ్ లాంగ్వేజ్
.మార్చి 24 – ఇంగ్లీష్
.మార్చి 26 – మ్యాథ్స్
.మార్చి 28 – ఫిజిక్స్
.మార్చి 29 – బయాలజీ
.ప్రిల్ 2 – సోషల్ స్టడీస్