📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Latest News: WIFI – రోజంతా వైఫై ఆన్ చేస్తే ఆరోగ్యానికి మంచిదేనా?

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటి డిజిటల్‌ యుగంలో వైఫై (WIFI) లేకుండా ఒక రోజు గడపడం కూడా చాలా మందికి కష్టంగా మారింది. ఇంటర్నెట్‌ కనెక్షన్ కోసం కేబుల్‌లు, కనెక్టర్ల జంజాటం లేకుండా సులభంగా పరికరాలను కలుపుతున్న టెక్నాలజీ వైఫై. చాలామంది దీన్ని “వైర్‌లెస్ ఫిడిలిటీ” అని భావిస్తారు. కానీ వాస్తవానికి దీనికి ప్రత్యేకమైన ఫుల్ ఫామ్ ఏదీ లేదని ‘వైఫై అలయన్స్’ స్వయంగా ప్రకటించింది. అంటే హైఫై అంటే హై ఫిడిలిటీ అని ఎలా చెబుతామో, అలా వైఫైకి కూడా అర్థం ఉందనుకోవడం తప్పు. ఇది కేవలం ట్రేడ్ మార్క్‌గా ఉంచిన పేరు మాత్రమే.

వైఫై రూటర్ ద్వారా మనం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, కంప్యూటర్లను కేబుల్‌ల జోలికీ పోకుండా కనెక్ట్ చేసుకోవచ్చు. రూటర్ సృష్టించే వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ (WLAN) ద్వారా పరికరాలు ఒకదానితో ఒకటి, అలాగే ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవుతాయి. పనికోసమో, వినోదానికోసమో ఈ సౌకర్యం ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరింది.

రౌటర్‌లకు ఎక్స్‌పోజర్ ఉండటం వల్ల

అయితే ఈ సౌకర్యం వెనుక దాగిన ఒక చర్చ చాలా మందిని ఆలోచింపజేస్తోంది – రౌటర్‌లను రాత్రంతా ఆన్‌లో ఉంచడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? మొబైల్‌ ఫోన్ల (Mobile phones) అధిక వాడకానికి సంబంధించిన హానులు గురించి మనం తరచూ వింటున్నాం. కానీ అదే తరహా చర్చ ఇప్పుడు వైఫై చుట్టూ కూడా మొదలైంది.పరిశోధనల ప్రకారం, రౌటర్‌లు పనిచేసేటప్పుడు తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు విడుదలవుతాయి.

WIFI

ఇవి మొబైల్‌ ఫోన్ సిగ్నల్‌ల కంటే చాలా తక్కువ శక్తితో ఉంటాయి. ఈ తరంగాలు మానవ శరీరంపై తక్షణ హానికరం కాదని ఎక్కువ శాతం అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ దీర్ఘకాలంలో రాత్రింబవళ్లు రౌటర్‌ (Router) లకు ఎక్స్‌పోజర్ ఉండటం వల్ల తలనొప్పి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు రావచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ అంశంపై స్పష్టమైన, అంతర్జాతీయంగా అంగీకరించబడిన సాక్ష్యం లేకపోయినా, కొన్ని దేశాల్లో రాత్రి రౌటర్ ఆఫ్ చేయమని సలహా ఇస్తున్నారు.

ఎక్కువ సమయం పరికరాలకి దగ్గరగా కూర్చోవడం

ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, రౌటర్‌ను పూర్తిగా ఆఫ్ చేయడం తప్పనిసరి కాకపోయినా, ఎక్కువ సమయం పరికరాలకి దగ్గరగా కూర్చోవడం లేదా రౌటర్ పక్కనే నిద్రించడం మానుకోవడం మంచిదని. ముఖ్యంగా చిన్నపిల్లల గదుల్లో రౌటర్ పెట్టకపోవడం ఉత్తమం. రాత్రివేళల్లో నెట్ అవసరం లేకపోతే పవర్ ఆఫ్ చేసి పెట్టడం వల్ల విద్యుత్ కూడా ఆదా అవుతుంది.

మొత్తం మీద, వైఫై అనేది మన జీవితాన్ని సులభతరం చేసిన అద్భుతమైన సాంకేతికత. అయితే దాని వాడకంలో జాగ్రత్తలు తీసుకోవడం, సరైన దూరం పాటించడం, అవసరమైనప్పుడు మాత్రమే ఆన్‌లో ఉంచడం వంటివి పాటిస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. సౌకర్యం మన చేతుల్లో ఉంది, జాగ్రత్త కూడా మనమే పాటించాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/flipkart-big-billion-days-smartphone-sale/tech/548845/

Breaking News internet access latest news Mobile Addiction no full form Telugu News WiFi Alliance WiFi technology WiFi usage wireless connectivity wireless router WLAN

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.