Samsung Galaxy S25 SE 2025 : గెలాక్సీ అన్‌బాక్స్ ఈవెంట్లో శామ్సంగ్ కొత్తతరం ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్, గెలాక్సీ ఎస్25 ఎస్ఇ 5జీని అధికారికంగా విడుదల చేసింది.. ఈ కొత్త శామ్సంగ్ ఫోన్ గెలాక్సీ ఎస్25 (Samsung Galaxy S25 SE 2025) సిరీస్ నుండి కొన్ని ఫ్లాగ్ షిప్ ఫీచర్లను ప్యాక్ చేస్తుంది. అయితే మీరు ఏమాత్రం నష్టపోకుండా ఉండాలంటే కొత్త గెలాక్సీ ఎస్25 ఎస్ఇ 5జీ మొబైల్ ఏమి అందిస్తుందో పూర్తిగా తెలుసుకోవాలి.
వీటి ప్రత్యేక ఫీచర్లు ఏమిటంటే..
గెలాక్సీ ఎస్25 ఎస్ఇ 5జీ మొబైల్ 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 1207HZ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ తో 1900 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. డిజైన్ పరంగా, ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో మ్యాట్-గ్లాస్ ఫినిషింగ్ను కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్ 0.6 ఎంఎం సన్నగా ఉందని, 190 గ్రాముల బరువు మాత్రమే ఉందని ఆ కంపెనీ చెబుతోంది. స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఒన్ యుఐ 8పై నడుస్తుంది. ఇందులో అదనంగా శామ్సంగ్ వినియోగదారుల రక్షణ కోసం కీప్ నాక్స్ భద్రతా ఫీచర్ ను కూడా తీసుకువస్తుంది. సున్నితమైన పనితీరు కోసం, లిక్విడ్ థర్మల్ తో పెద్ద ఆవిరి శీతలీకరణ వ్యవస్థను కలిగి ఉంది.
Read also :