Phones Price Hike : కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు భారీ షాక్

Follow Us: Google News Daily Hunt
Prices of mobile phones and laptops
Prices of mobile phones and laptops
FONT SIZE
GET APP

Phones Price Hike : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. ప్రముఖ బ్రాండ్లు అయిన ఒప్పో (Oppo), వన్‌ప్లస్ (OnePlus), ఐకూ (iQOO), రెడ్‌మీ (Redmi), పోకో (Poco) మరియు వివో (Vivo) తమ వివిధ మోడళ్ల ధరలను భారీగా పెంచాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం మరియు మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పో తన పాపులర్ రెనో (Reno) మరియు ‘A’ సిరీస్ మోడళ్ల ధరలపై ఏకంగా రూ. 5,000 వరకు పెంపును విధించింది. బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ విభాగంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్ల ధరలు ఒక్కసారిగా పెరగడం సగటు కొనుగోలుదారుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉంది.

Read Also : టీవీ ఛానళ్లకు కేంద్రం తీపి కబురు

ఐకూ, వన్‌ప్లస్ ధరల్లో బిగ్ జంప్… ఆయా మోడళ్ల కొత్త లైనప్ ఇవే

వివిధ కంపెనీల మోడళ్ల వారీగా చూస్తే, ఐకూ (iQOO) కంపెనీ తన ప్రీమియం ఫోన్ అయిన ‘iQOO 15’ ధరను రూ. 13,000 మరియు ‘iQOO 15R’ ధరను రూ. 9,000 వరకు భారీగా పెంచింది. అలాగే, పోకో బ్రాండ్‌కు చెందిన X8 ప్రో, X8 ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు రెడ్‌మీ ఫోన్లపై రూ. 3,000 వరకు పెంపు నమోదైంది. మిడ్-రేంజ్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉన్న వన్‌ప్లస్ నార్డ్ 6 (OnePlus Nord 6) సిరీస్ వేరియంట్ల ధరలు రూ. 4,000 వరకు పెరగ్గా, వివో తమ ‘Y’ సిరీస్ మోడళ్లపై కూడా రూ. 4,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సడన్ ధరల పెంపుతో పండుగ సీజన్‌కు ముందు ఫోన్ కొనాలనుకునే వినియోగదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు