📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

Microsoft : ఉద్యోగులకు డెడ్ లైన్ విధించిన మైక్రోసాఫ్ట్!

Author Icon By Divya Vani M
Updated: April 24, 2025 • 6:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.తక్కువ పనితీరు చూపుతున్న ఉద్యోగులకు “ఒకే ఒక్క అవకాశం – ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకోండి” అంటూ హెచ్చరించింది.ఈ విషయంపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.మైక్రోసాఫ్ట్ ఇటీవల “గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ (GVSA)” అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.దీని ద్వారా తక్కువ పనితీరు చూపుతున్న ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. మొదటిది – పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP).రెండవది – స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ.PIP ఎంచుకుంటే – ఉద్యోగి కఠినమైన లక్ష్యాలను చేరుకోవాలి. కానీ, దీనిలో వేతన ప్యాకేజీ ఉండదు.విడివిడిగా వెళ్లాలంటే – 16 వారాల వేతనంతో కూడిన ప్యాకేజీ లభిస్తుంది. అయితే, రాబోయే రెండేళ్లలో మైక్రోసాఫ్ట్‌లో తిరిగి చేరే అవకాశం ఉండదు.అయితే, ఉద్యోగికి ఈ రెండు ఎంపికల్లో ఏదైనా తీసుకోవడానికి కేవలం ఐదు రోజులే మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ ఏప్రిల్ 22న మేనేజర్లకు మెయిల్ పంపారు.

Microsoft ఉద్యోగులకు డెడ్ లైన్ విధించిన మైక్రోసాఫ్ట్!

పనితీరు ఆధారంగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం కీలకం అని అందులో పేర్కొన్నారు.సంపూర్ణ పారదర్శకతతో, వేగవంతమైన నిర్ణయాల వల్ల సంస్థలో వృద్ధి సంస్కృతి ఏర్పడుతుంది అని ఆమె స్పష్టం చేశారు.PIPలో ఉంటే, ఉద్యోగికి ఇంకెలాంటి వేతన ప్యాకేజీ లభించదు.వాలంటరీ ఎగ్జిట్ తీసుకుంటే, రెండు సంవత్సరాలు మైక్రోసాఫ్ట్‌లో తిరిగి దరఖాస్తు చేయలేరు.అంతర్గత బదిలీలకు అర్హత లేకపోవచ్చు.ఐదు రోజుల డెడ్‌లైన్ వల్ల ఉద్యోగులపై భయంతో కూడిన ఒత్తిడి పెరిగింది. ప్యాకేజీ తీసుకుంటే భవిష్యత్తు అవకాశాలు కోల్పోతారనే భయం… లేదా PIPలో పడితే ఉద్యోగ భద్రత ఉంటుందా అనే సందేహం… వారిని గందరగోళానికి గురిచేస్తోంది.ఈ విధానం ద్వారా మైక్రోసాఫ్ట్ తమ వర్క్‌ఫోర్స్‌ను నెమ్మదిగా తగ్గిస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పనితీరు మెరుగుపరచే పేరుతో ఉద్యోగులను నెమ్మదిగా బయటకు పంపించే ప్రయత్నమే ఇదని పరిశీలకులు అంటున్నారు.మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ కొత్త విధానం ఉద్యోగుల పని పద్ధతుల్లో మార్పులు తేవడానికే సరిపడుతుందా? లేక ఉద్యోగుల భద్రతకు ఇది ముప్పుగా మారుతుందా? అన్నదే ఇప్పుడు టెక్ ప్రపంచంలో వేడెక్కిన చర్చగా మారింది.

Read Also : Summer Holidays: తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు నేటి నుండి వేసవి సెలవులు

Microsoft 5 Days Notice Microsoft Employee Decision Microsoft GVSA Policy Microsoft Voluntary Exit PIP at Microsoft

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.