Green Dot Further in Whatsapp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp), తమ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. అదే ‘గ్రీన్ డాట్’ (Green Dot) ఫీచర్. సాధారణంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్లలో మన స్నేహితులు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు వారి ప్రొఫైల్ పిక్చర్‌పై పచ్చటి చుక్క (గ్రీన్ డాట్) కనిపించే విధానం మనకు తెలిసిందే. ఇప్పుడు అదే తరహా ఫీచర్‌ను వాట్సాప్ కూడా తన ప్లాట్‌ఫారమ్‌పై తీసుకురానుంది. ఈ సరికొత్త అప్‌డేట్ ప్రకారం, కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఎవరెవరు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్నారో సులభంగా తెలుసుకోవచ్చు. యాక్టివ్‌గా ఉన్న యూజర్ల ప్రొఫైల్ ఫోటోపై ఈ గ్రీన్ డాట్ స్పష్టంగా కనిపిస్తుంది, దీనివల్ల ప్రతి ఒక్కరి చాట్ బాక్స్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేకుండానే వారు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అనేది యూజర్లు ఒకే చూపులో కనిపెట్టేయవచ్చు.
Read Also : ఆండ్రాయిడ్ 17 తీసుకొచ్చిన టాప్-5 ఫీచర్లు ఇవే..క్రియేటర్స్‌కు ఇక తిరుగులేదు!

రీసెంట్ యాక్టివిటీ లిస్ట్.. ప్రైవసీకి భంగం కలగకుండా వాట్సాప్ జాగ్రత్తలు!
ఈ సరికొత్త ఫీచర్‌లో భాగంగా కేవలం ప్రస్తుత ఆన్‌లైన్ స్టేటస్ మాత్రమే కాకుండా, రీసెంట్‌గా వాట్సాప్ ఓపెన్ చేసి యాక్టివ్‌గా ఉన్న వారి పేర్లను కూడా ఒక ప్రత్యేక లిస్టులో చూపిస్తుంది. అయితే, వినియోగదారుల వ్యక్తిగత ప్రైవసీ (Privacy)కి భంగం కలగకుండా వాట్సాప్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. తమ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ‘లాస్ట్ సీన్’ (Last Seen) మరియు ‘ఆన్‌లైన్ స్టేటస్’ను హైడ్ (Hidden) చేసుకున్న వారి వివరాలను ఈ గ్రీన్ డాట్ ఫీచర్ చూపించదు. అంటే, ప్రైవసీని కాపాడుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ నుండి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఈ అధునాతన ఫీచర్ ఇంకా అభివృద్ధి మరియు టెస్టింగ్ (Beta Testing) దశలోనే ఉంది. త్వరలోనే బీటా పరీక్షలన్నీ పూర్తి చేసుకుని, ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అధికారికంగా అందుబాటులోకి రానుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :