ChatGPT : ఓపెన్ఏఐ (OpenAI) అభివృద్ధి చేసిన ఛాట్‌జీపీటీ (ChatGPT)ని వైద్య సలహా కోరడం అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 55 ఏళ్ల పాస్టర్ స్కాట్ జీవితాన్ని తీవ్ర ప్రమాదంలో పడేసింది. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన, తన ఆరోగ్య సమస్యలను ఛాట్‌జీపీటీకి వివరించి తగిన వైద్య సలహా అడిగారు. అయితే, ఆ ఏఐ చాట్‌బాట్ ఆయనను ఆసుపత్రికి వెళ్లమని గానీ, వైద్యులను సంప్రదించమని గానీ సూచించకుండా… “దేవుడే నిన్ను రక్షిస్తాడు, ధైర్యంగా ఉండు” అంటూ మతపరమైన ఉచిత సలహాలు ఇచ్చింది. చాట్‌జీపీటీ మాటలను గుడ్డిగా నమ్మిన పాస్టర్ స్కాట్ సరైన సమయంలో వైద్యం తీసుకోకపోవడంతో, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి చివరకు తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి (Severe Lung Disease)కి దారితీసింది.
Read Also ; శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సిరీస్ ఫోన్లు విడుదల

ఓపెన్ఏఐపై కోర్టులో దావా: ఏఐ వైద్య సలహాలపై ఆందోళన
సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర అనారోగ్యానికి గురైన పాస్టర్ స్కాట్, ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఓపెన్ఏఐ సంస్థపై న్యాయస్థానంలో భారీ దావా వేశారు. ఏఐ చాట్‌బాట్‌లు అందించే నిరూపితంకాని, తప్పుదారి పట్టించే సమాచారం వల్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతోందని ఆయన వాపోయారు. ఈ ఘటనతో కృత్రిమ మేధస్సును వైద్య సలహాల కోసం గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టమైంది. సాధారణ సమాచారం లేదా సాంకేతిక సేవలకు ఏఐ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యల విషయంలో అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :