శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్.

శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘తండేల్’ మంచి విజయం సాధించింది. చందూ ,మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రూ. 100 కోట్ల మైల్ స్టోన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నాగచైతన్య, సాయి పల్లవితో పాటుగా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ చందూ మొండేటి కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారమే తిరుపతికి చేరుకున్న ‘తండేల్’ టీం,ఇవాళ వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.’తండేల్’ సినిమా రిలీజైన తర్వాత నిర్మాత బన్నీ వాసుతో కలిసి ఇటీవల చైతన్య, చందూ మొండేటి విజయవాడలోని కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్ తన సతీమణితో కలిసి టీం మొత్తాన్ని తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. రిలీజ్ తర్వాత మూవీ ప్రమోషన్స్ లో కనిపించని సాయి పల్లవి కూడా చిత్ర యూనిట్ తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంది.దర్శనానంతరం ‘తండేల్’ మూవీ టీమ్ తిరుపతిలోని ఓ థియేటర్ ను విజిట్ చేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం స్థానిక కోడిరామ మూర్తి స్టేడియంలో థ్యాక్యూ మీట్ నిర్వహించనున్నారు.

Thandel Movie Team at Tirumala (1)

విజయోత్సవ దారిలో ‘తండేల్’
సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. నేచురల్ లవ్ స్టోరీ, నాగచైతన్య – సాయి పల్లవి కెమిస్ట్రీ, చందూ మొండేటి దర్శకత్వ ప్రతిభ – ఇవన్నీ కలిసి సినిమాను హిట్ ట్రాక్‌లో నిలిపాయి.

సినిమా హైలైట్స్:

చందూ మొండేటి దర్శకత్వంలో సహజమైన కథనంతో ప్రేక్షకులను మెప్పించిన సినిమా

సంగీతం, విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

ఫ్యామిలీ ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన

ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ ఉండటంతో, వసూళ్లు కొనసాగుతున్నాయి.

Related Posts
జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత
avanthi srinivas resigns ycp

గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రస్తుతం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన పార్టీని, పలువురు కీలక Read more

వివేకా హత్య కేసు సాక్షి మృతదేహానికి మళ్ళీ పోస్టుమార్టం
వివేకా హత్య కేసు: కీలక సాక్షి మృతి.. మళ్ళీ పోస్టుమార్టం!

కడప జిల్లా రాజకీయాల్లో కలకలం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి దుమారం రేపుతోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న అనారోగ్యంతో Read more

ఏపీ లో మున్సిపల్ అధికారుల కీలక ఆదేశాలు
ఏపీ లో మున్సిపల్ అధికారుల కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనిమున్సిపాలిటీల్లో పన్నుల బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రెండో Read more

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త
AP Sarkar good news for une

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ట్రెయిన్ అండ్ హైర్ Read more