Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ ప్రభుత్వం !

Read Time:  1 min
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ ప్రభుత్వం !
FONT SIZE
GET APP

జమ్ముకశ్మీర్‌లో 56 మంది విద్యార్థులు చిక్కుకుపోవడంతో తమిళనాడు సర్కార్ (Tamilanadu Government)అప్రమత్తమైంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనతో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా హైలర్ట్‌ (High alert )కొనసాగుతోంది. సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూ, క్షిపణి దాడులకు పాల్పడుతోంది. వాటిని భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి.

 Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ ప్రభుత్వం !
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ ప్రభుత్వం !

అప్రమత్తమైన సర్కారు
జమ్ముకశ్మీర్‌లో 56 మంది విద్యార్థులు చిక్కుకుపోవడంతో తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనతో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా హైలర్ట్‌ కొనసాగుతోంది. సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూ, క్షిపణి దాడులకు పాల్పడుతోంది. వాటిని భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి.
ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన 56 మంది విద్యార్థులు (Students)జమ్ము కశ్మీర్‌లో చిక్కుకుపోయారు. తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్‌లోని పలు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇటీవలే తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం జమ్ము కశ్మీర్ వెళ్లారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు సర్కారు వారిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోవడంంతో.. 56 మంది విద్యార్థులను రోడ్డు మార్గంలో తిరిగి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ల్యాండ్ లైన్‌తో పాటు వాట్సాప్ నెంబర్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని తమిళనాడు సర్కారు సూచించింది.

Read Also : India Pakistan War: రెండు పాక్‌ జెట్స్‌ను గాల్లోనే పేల్చేసిన భారత్‌

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.