हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Tamanna: త‌మ‌న్నాపై క‌న్న‌డిగులు ఆగ్ర‌హం ఎందుకంటే?

Anusha
Tamanna: త‌మ‌న్నాపై క‌న్న‌డిగులు ఆగ్ర‌హం ఎందుకంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తమన్నా హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారింది. ఆ త‌ర్వాత త‌మ‌న్నా ప‌లు హిందీ చిత్రాల‌లో కూడా న‌టించి అల‌రించింది.మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna) ఈ మధ్యకాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. తెలుగులో రీసెంట్ గా ఓదెల 2 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తమన్నా అఘోర పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతుంది. తెలుగులో కంటేహిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది.తమన్నాసినిమాలతో పాటు పలు యాడ్స్ షూట్ లోనూ నటిస్తుంది. ఇలా రెండు చేతులా సంపాదిస్తుంది.అయితే ఇప్పుడు త‌మన్నాకి క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కింది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న ప్రఖ్యాత మైసూరు శాండల్ స‌బ్బు(Mysore Sandal Soap)ల‌తో పాటు ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా నియమించారు. ఈ ఒప్పందం రెండేళ్ల కాలానికి కుదరగా, ఇందుకోసం ఆమెకు రూ. 6.2 కోట్ల భారీ మొత్తం చెల్లించనున్నట్లు తెలుస్తుంది. అయితే త‌మ‌న్నాని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక చేయ‌డం ప‌ట్ల క‌న్న‌డ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.ఎందుకంటే,

 Tamanna: త‌మ‌న్నాపై క‌న్న‌డిగులు ఆగ్ర‌హం ఎందుకంటే?
Tamanna: త‌మ‌న్నాపై క‌న్న‌డిగులు ఆగ్ర‌హం ఎందుకంటే?

అంబాసిడ‌ర్‌

క‌న్న‌డ‌లో ఇంత మంది స్టార్స్ ఉండ‌గా, ఆమెని ఎంపిక చేయ‌డం ప‌ట్ల క‌న్న‌డిగులు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క భారీ, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్ అయ్యారు. త‌న‌కు క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌పై గౌరవం ఉంది, కాని కేఎస్‌డిఎల్ సంస్థ(KSDL company) త‌మ ఉనికిని దేశ వ్యాప్తంగా విస్త‌రించాల‌నే ల‌క్ష్యం పెట్టుకుంది. అందుకే తాము పాన్ ఇండియా సెల‌బ్రిటీని ప్ర‌చార‌క‌ర్త‌గా పెట్టామ‌ని అన్నారు. త‌మన్నా ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ చిత్రాల‌లో నటిస్తుంది. జాతీయ స్థాయిలో ఆమెకి గుర్తింపు ఉంది కాబ‌ట్టి అలాంటి వ్యక్తిని బ్యాండ్ అంబాసిడ‌ర్‌గా పెట్టుకుంటే త‌మ ప్రొడ‌క్ట్‌ని మ‌రింత విస్త‌రించ‌వ‌చ్చు. త‌మ‌న్నా హై ప్రొఫైల్ బ్యూటీ, స్కిన్ కేర్ బ్రాండ్‌ల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా ప‌ని చేశారు.త‌న‌కి అనుభ‌వం ఉంది కాబ‌ట్టి ఆమె ద్వారా ద‌క్షిణాది రాష్ట్రాల‌కి వ్యాప్తి చేయ‌వ‌చ్చు. మార్కెటింగ్ నిపుణుల నుండి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారానే త‌మ‌న్నాని ఎంపిక చేశాం అని వివ‌ర‌ణ ఇచ్చారు.

Read Also: MrBeast: యూట్యూబర్ గా వేల కోట్లు సంపాదించిన మిస్టర్‌బీస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870