हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Supreme Court: ప్రసూతి సెలవుల తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్ట్

Anusha
Supreme Court: ప్రసూతి సెలవుల తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్ట్

సుప్రీం కోర్టు ప్రసూతి సెలవుల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక పునరుత్పత్తి హక్కులు మహిళలకు ఉన్న ప్రత్యుత్పత్తి హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకం అని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఏ సంస్థ కూడా ఒక మహిళకు ప్రసూతి సెలవు హక్కులను హరించలేదని స్పష్టం చేసింది. రెండో వివాహం వల్ల బిడ్డ పుట్టిన తర్వాత ప్రసూతి సెలవు కావాలని దరఖాస్తు చేసుకోగా నిరాకరించడంపై సదరు ఉపాధ్యాయురాలు కోర్టుకు వెళ్లింది. ఈక్రమంలోనే ధర్మాసనం విచారణ చేపట్టి ఈ కామెంట్లు చేసింది. తమిళనాడు(TamilNadu)కు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి అప్పటికే ఒకసారి పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే పలు సమస్యల వల్ల మొదటి భర్తతో విడిపోయిన ఆమె రెండో వివాహం చేసుకుంది. ఈక్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. అయితే సర్కారు ఉపాధ్యాయిని కాగా ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ రెండో భర్త ద్వారా పుట్టే పిల్లలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం కుదరదని సర్కారు తెలిపింది. ఆమెకు సెలవులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈక్రమంలోనే అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం రోజు విచారణ చేపట్టింది.

వాదనలు

ఈ సందర్భంగానే ఉపాధ్యాయురాలు తరఫు న్యాయవాది కె.వి ముత్తు కుమార్ ఆమె తరఫున వాదనలు వినిపించారు. ఆమెకు రెండో వివాహం జరిగాకే ఉద్యోగం వచ్చిందని చెప్పారు. పిటిషనర్ గతంలో ఎప్పుడూ ప్రసూతి సెలవులు తీసుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆమె ప్రాథమిక హక్కు(Fundamental right)లను ఉల్లంఘించిందని అన్నారు. కానీ ప్రభుత్వం తరఫు న్యాయవాది మాత్రం రెండో పెళ్లి ద్వారా గర్భం దాల్చిన వారికి ఈ సెలవులు వర్తించవని చెప్పింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఉపాధ్యాయురాలి తరపునే నిలిచింది. ముఖ్యంగా మహిళలకు ఉన్న ప్రత్యుత్పత్తి హక్కుల్లో ప్రసూతి సెలవులు చాలా కీలకం అని వ్యాఖ్యానించింది. ఏ సంస్థ కూడా మహిళలకు ఉన్న ప్రసూతి సెలవుల హక్కులను హరించలేదని తెలిపింది.

Supreme Court: ప్రసూతి సెలవుల తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్ట్
Supreme Court: ప్రసూతి సెలవుల తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్ట్

ఉద్యోగులకు

2017లో సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ప్రసూతి ప్రయోజన చట్టానికి గణనీయమైన సవరణలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. బిడ్డను దత్తత తీసుకోవాలనుకునే మహిళలు కూడా 12 వారాల ప్రసూతి సెలవులకు అర్హులని చేసింది. గతంలో కూడా అనేక కేసుల్లో ప్రసూతి సెలవు హక్కును సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది. ఉద్యోగ స్వభావంతో సంబంధం లేకుండా అందరు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను ఇవ్వాలని తేల్చి చెప్పింది.

Read Also: Southwest Winds : నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870