ఆరోగ్యానికి మేలు చేసే ముల్లంగితో తయారయ్యే ముల్లంగి పరోటా(mullangi paratha recipe) ముల్లంగి పరోటా, రుచికరమైన మరియు పోషకాహారంతో నిండిన వంటకం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌కు ఈ పరోటా సమ్మోహనంగా ఉంటుంది. తక్కువ సమయంలో సులభంగా తయారుచేసుకునే ఈ వంటకం మీకు నచ్చుతుంది.
ముల్లంగి పరోటా తయారీ విధానం (mullangi paratha recipe)
కావలసిన పదార్థాలు:
- గోధుమపిండి – 2 కప్పులు
- ముల్లంగి తురుము – 1 కప్పు
- పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
- అల్లం – అంగుళం ముక్క (తురుము)
- ఆమ్చూర్ పొడి – 1 టీస్పూన్
- గరం మసాలా – 1 టీస్పూన్
- ధనియాల పొడి – 1 టీస్పూన్
- జీలకర్ర పొడి – 1 టీస్పూన్
- కారం – 1 టీస్పూన్
- చాట్ మసాలా – 1 టీస్పూన్
- ఉప్పు – తగినంత
- కొత్తిమీర తురుము – కొద్దిగా
- నూనె – సరిపడినంత
తయారు చేసే విధానం:
పిండి కలపడం:
ముందుగా గోధుమపిండిలో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
ముల్లంగి మిశ్రమం తయారీ విధానం:
ముల్లంగి తురుములోని నీళ్లను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ముల్లంగి తురుము, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
పరోటా తయారీ విధానం:
గోధుమపిండి నుండి చిన్న లడ్డూలా తీసుకుని మధ్యలో ముల్లంగి మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసి పరోటాలా ఒత్తుకోవాలి.
పెనంలో నూనె వేసి వేడెక్కిన తర్వాత పరోటాను రెండు వైపులా బంగారు రంగులో వచ్చేలా కాల్చుకుంటే..!
ముల్లంగి పరోటా సిద్ధం.



