हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు

Funny jokes: సరదాగా కాసేపు నవ్వుకోండి

Digital
Funny jokes: సరదాగా కాసేపు నవ్వుకోండి

సమయాన్ని సరదాగా మార్చే నవ్వుల జోక్స్ (jokes) కలెక్షన్. కొత్త కొత్త హాస్య చినుకులు, కుటుంబంతోనూ స్నేహితులతోనూ పంచుకోవడానికి సరైన జోక్స్.”

jokes

పోలీసు & దొంగ:
పోలీసు: “దొంగతనం చేయడానికి ఎప్పుడూ ఆ ఇంటికే వెళ్తావెందుకు?”
దొంగ: వాస్తు పరంగా ఆ ఇల్లు నాకు బాగా కలిసొచ్చింది సార్! ????

మగవాడు & ఆడవాడు:
మొదటి వ్యక్తి: మగవాడికి ధైర్యం రావాలంటే మందు కొడతాడు. మరి ఆడవాళ్లకి ధైర్యం రావాలంటే ఏం చెయ్యాలి?
రెండవవాడు: మెడలో తాళి పడగానే వాళ్లకి ధైర్యం వస్తుంది! ????

పేపర్ దోసె & ఫ్యాన్:
కస్టమర్: పేపర్ దోసెలు తెచ్చావు కదా, ఇక ఫ్యాన్ వెయ్యి.
సప్లయర్: వద్దండీ, రువ్వు… ఫ్యాన్ గాలికి దోసెలు ఎగిరిపోతాయి! ????

తొమ్మిది ఇన్ టూ:
టీచర్: భాస్కర్, తొమ్మిది ఎంతరా?
భాస్కర్: చెప్పను.
టీచర్: ఎందుకు చెప్పవు?
భాస్కర్: నన్ను ప్రశ్నలు అడగొద్దని ప్రతీ నెలా మా నాన్న మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాడుగా! ????

jokes

టీచర్ & చింటూ:
టీచర్: చింటూ! నేను వంద రూపాయలు, సోషల్ టీచర్ వంద రూపాయలు, లెక్కలు టీచర్ వంద రూపాయలు, తెలుగు టీచర్ వంద రూపాయలు ఇస్తే… మొత్తం నీ దగ్గర ఎంత ఉంటుంది?
చింటూ: ఆ! ఎందుకులెండి? అవన్నీ జరగని పన్లు సార్! ????

భర్త & హెల్మెట్:
భర్త: ఏమేవ్! ఎక్కడున్నావు? ఆఫీసుకు లేటవుతోంది. నా హెల్మెట్ ఎక్కడ పెట్టావు?
భార్య: టూత్పేస్టు, టూత్ బ్రష్ లు వేసి బాత్రూం గోడకు తగిలించాను! ????

jokes

గిన్నిస్ బుక్:
రాము: అమ్మా, నేను గిన్నిస్ బుక్ ఎక్కాను.
తల్లి: ఎప్పుడు? ఎలా?
రాము: గిన్నె మీద బుక్ పెట్టి ఎక్కాను! ????

తాత & పిల్లలు:
తాత: సీతా! పెద్దయ్యాక నీవు ఏమవుతావు?
సీత: నేను డాక్టర్ని అవుతాను.
తాత: వెరీగుడ్. శ్రీనూ! నువ్వు?
శ్రీను: నేను ఇంజినీరు అవుతాను.
తాత: వెరీగుడ్. శేఖర్! నువ్వు?
శేఖర్: పెరిగి పెద్దయ్యాక నీలా ముసలివాడిని అవుతాను! ????

jokes

పండగ & అత్తగారింట్లో:
అప్పారావు: ఏం గోవిందూ! పండక్కి అత్తారింటికి వెళ్లలేదా?
గోవిందు: మా అత్తగారింట్లో ఒక ఆచారం వుందిరా… పండగ మూడు రోజులూ కొత్త అల్లుడు కళ్లాపి జల్లి, ముగ్గులు పెట్టాలి! ????

పుస్తకం చదువు:
కాంతం: పద్మా! ఈ మధ్య కనిపించలేదు, అంత బిజీగా వున్నారా?
పద్మ: పుస్తకం చదువుతున్నాను.
కాంతం: ఏం పుస్తకం?
పద్మ: మొగుణ్ణి ఎలా అదుపులో పెట్టాలి అనే పుస్తకం! ????

బ్యాంక్ బ్యాలెన్స్:
రవి: ఒరే గోపీ! రంగా ప్రేమించిన అమ్మాయితో నీకు పెళ్లి అయిందేమిట్రా?
గోపి: వాడి కన్నా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువుంది మరీ! ????

రాఖీలు:
భార్య: ఎక్కడి నుంచి ఉత్తరం?
భర్త: అమ్మాయి దగ్గర నుంచి.
భార్య: ఏంటి విశేషాలు?
భర్త: అక్కడ రాఖీలు దొరకడం లేదట. రాఖీలు పంపించమంది. చుట్టుపక్కల అమ్మాయిల చేత అల్లుడు గారికి కట్టించడానికి! ????

jokes

అప్పు & బట్టలు:
భర్త భార్యతో: ఈ వీధిలో నీ బట్టలు నేను ఉతుకుతున్నానని చెప్పినా పర్వాలేదుగానీ మీ అమ్మ బట్టలు కూడా నేనే ఉతుకుతున్నానని చెప్పకే!
భార్య: ఏం? ఎందుకని??
భర్త: పక్కింటి సుబ్బారావు అప్పు ఇవ్వడం మానేస్తాడు! ????

jokes

కొత్తమీర, కరివేపాకు:
కాంతం: వరలక్ష్మీగారూ! కొత్తమీర, కరివేపాకు మీరు ఎక్కడ కొంటున్నారు?
వరలక్ష్మి: లేదండీ! నాకు ఎప్పుడు అవసరం వచ్చినా పక్కింటి విజయ దగ్గరే తీసుకుంటాను! ????

Read also: Funny jokes: నవ్వుల్-రువ్వుల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870