Bala Geyalu in telugu: బాలగేయం
బాలగేయం అమ్మకు సాయం చిట్టీ.. చింటూ.. లేవండి తెల్లారింది చూడండి.. యోగా బాగా చేయండి పాలూ గుడ్లూ తినండి.. సరే సరే.. అలాగే చేస్తాం ముందు డాబా పైకి వెళ్లొస్తాం పావురాలకు గింజలేస్తాం పక్షుల దప్పిక తీరుస్తాం.. అక్కా తోటను చూద్దామా మొక్కలకు నీళ్లు పోద్దామా గులాబిపూలు కోద్దామా దేవుడిబొమ్మకు పెడదామా.. టీవీ సోఫా శుభ్రం చేద్దాం బీరువాలో దుస్తులు సర్దేద్దాం నాన్న బండిని కడిగేద్దాం తాతతో బజారు చెక్కేద్దాం.. " నూనె పదార్థాలు తినం తినం ఇడ్లీలే ఎంతో ఘనం ఘనం సాత్వికం మా భోజనం కుండనీళ్లంటే ప్రాణం.. " అమ్మకు చేస్తాం పనిలో సాయం బామ్మ కథలు ఎంతో ప్రియం.