CBN ABV

ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు గుడ్ న్యూస్

ఏపీలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీకి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పలు అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఇబ్బందులు మొదలయ్యాయి.తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఏబీకి వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. కోర్టులో ఊరట లభించినా తిరిగి సస్పెండ్ చేసింది. దీంతో సస్పెన్షన్ కాలంలో ఆయనకు చెల్లించాల్సిన జీత భత్యాల్ని కూడా నిలిపేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జీత భత్యాలు చెల్లించాల్సి ఉంది. అయినా వీటిని చెల్లించకుండా ఆలస్యం చేశారు.

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో జరిగిన తప్పిదాలను సవరించడం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయనపై గత వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాల్ని కూటమి సర్కార్ ఉపసంహరించుకుంది. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన రెండుసార్లు సస్పెండ్ అయిన కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు అప్పట్లో సస్పెన్షన్ కాలంలో బకాయి ఉన్న జీత భత్యాల్ని చెల్లించబోతున్నారు.

Related Posts
ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు
ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు

భారతదేశంలో వందేభారత్ రైలు ఓ చరిత్ర. పలు సౌకర్యాలతో పాటు నిర్ణిత సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇందులో భాగంగా త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్ర వారణాసికి ఏపీ నుంచి Read more

మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్..?
Manchu Manoj

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల కుటుంబ విభేదాలతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఈరోజు రంగంపేటకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా మనోజ్ Read more

టీవీ-5 అధినేత బీఆర్‌ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌ పదవి;
TTD

23 మంది సభ్యులతో కూడిన టీటీడీ బోర్డు ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు Read more

3 రోజుల్లో రూ.216 కోట్లు విడుదల చేస్తాం: మంత్రి లోకేశ్
lokesh 2 300cr

ఇంజినీరింగ్ విద్యా రంగంలో నాణ్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం పూర్తి కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీల సంఘం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *