Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

Read Time:  1 min
Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
FONT SIZE
GET APP

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market)సూచీల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతు కొనసాగుతున్నప్పటికీ.. ఫైనాన్షియల్‌, ఆటోమొబైల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ, రిలయన్స్‌ షేర్లు సూచీలను కిందకు లాగాయి. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ ఓ దశలో 500 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 25,550 దిగువకు చేరింది.
సెన్సెక్స్‌, నిఫ్టీ ఎలా కదలాడాయి?
సెన్సెక్స్‌ (Sensex) ఉదయం 84,027.33 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,058.90) ఫ్లాట్‌గా ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 83,482.13- 84,099.53 మధ్య చలించిన సూచీ.. చివరికి సెన్సెక్స్‌ (Sensex) 452.44 పాయింట్ల నష్టంతో 83,606.46 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) సైతం 120.75 పాయింట్ల నష్టంతో

Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

25,517.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి (Rupee) మారకం విలువ 85.74గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ట్రెంట్‌, ఎస్‌బీఐ, బీఈఎల్, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలు ఇవ్వడానికీ, విదేశీ మదుపర్లు కొనుగోళ్ల మద్దతు ఇచ్చినప్పటికీ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (Crudoil)– బ్యారెల్‌కు $67.58 వద్ద, బంగారం ఔన్సు ధర – $3299 వద్ద కొనసాగుతోంది. డాలరుతో మారకం విలువ – ₹85.74 వద్ద స్థిరంగా ఉంది.

Read Also: Rbi Gold Vault : తొలిసారి పసిడి రహస్యాలను వెల్లడించిన రిజర్వ్

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.