हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Missile: రష్యా నుంచి అత్యాధునిక R-37M హైపర్‌సోనిక్ మిస్సైల్

Shobha Rani
Missile: రష్యా నుంచి అత్యాధునిక R-37M హైపర్‌సోనిక్ మిస్సైల్

హమాస్‌, హెజ్బుల్లాతో యుద్ధం ద్వారా ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ సామర్థ్యం ప్రపంచానికి తెలిస్తే.. పాకిస్తాన్‌తో స్వల్పకాలిక యుద్ధంతో భారత గగనతల రక్షణ వ్యవస్థ డైమండ్ డోమ్ సత్తా లోకానికి తెలిసింది. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు శత్రుదేశాలు గగనతలం నుంచే ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థ ఒక్కటే ఉంటే సరిపోదు. శత్రుదేశం ఆట కట్టించేందుకు గగనతనం నుంచి దాడులు చేసే సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారత్ అదే పని చేస్తోంది. భారత ఫైటర్‌జెట్ పైలట్లు శత్రుదేశ భూభాగంలోకి అడుగుపెట్టకుండా సుదూర లక్ష్యాలను ధ్వంసం చేసే అధునాతన లాంగ్ రేంజ్ మిస్సైళ్ల(Missile)ను సమకూర్చుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో భారతదేశానికి తన అత్యాధునిక R-37M హైపర్‌సోనిక్ లాంగ్-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌ను అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ మిస్సైల్‌(Missile)ను భారత వైమానిక దళం ఉపయోగిస్తున్న రష్యన్ తయారీ సుఖోయ్ (Su-30MKI) ఫైటర్ జెట్‌లలో అమర్చి వినియోగించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారతదేశ గగన రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుంది. పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాల వైమానిక శక్తిని వెనక్కి నెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
R-37M మిస్సైల్ పరిచయం
రష్యా దేశానికి చెందిన R-37Mకు నాటో AA-13 Axeheadగా నాటో దేశాలు వ్యవహరిస్తాయి. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన లాంగ్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌లలో ఇది ఒకటి. రష్యా వింపెల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్(Missile), శత్రు విమానాలను సుమారు 300 – 400 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ చేయగలదు. దీని హైపర్‌సోనిక్ వేగం మాక్ 6 (ధ్వని వేగం కంటే 6 రెట్లు) ఈ క్షిపణిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేస్తుంది. ఈ మిస్సైల్ ప్రధానంగా శత్రుదేశానికి చెందిన AWACS (ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్), ట్యాంకర్ విమానాలు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. లాంగ్ రేంజ్ సామర్థ్యం కారణంగా భారత వైమానికదళం శత్రు దేశం లోపలకు చొరబడకుండానే భారత గగనతలం నుంచి ప్రయోగించే అవకాశాన్ని ఇస్తుంది. తద్వారా మన ఫైటర్ జెట్లు, పైలట్లు మరింత సురక్షితంగా ఉంటూ శత్రుదేశపు లక్ష్యాలను ధ్వంసం చేయడం సాధ్యపడుతుంది.

Missile: రష్యా నుంచి అత్యాధునిక R-37M హైపర్‌సోనిక్ మిస్సైల్
Missile: రష్యా నుంచి అత్యాధునిక R-37M హైపర్‌సోనిక్ మిస్సైల్

సాంకేతిక విశేషాలు
రేంజ్: 300 నుంచి 400 కిలోమీటర్ల వరకు, Beyond Visual Range (BVR) మిస్సైల్‌(Missile)లలో అగ్రగామి.
వేగం: మాక్ 6 (సుమారు 7,400 కిమీ/గంట), హైపర్‌సోనిక్ సామర్థ్యం.
వార్‌హెడ్: 60 కిలోగ్రాముల హై-ఎక్స్‌ప్లోసివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్, ఇది భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు.
బరువు: సుమారు 510 కిలోగ్రాములు.
ఇనర్షియల్ నావిగేషన్.
మిడ్-కోర్స్ అప్‌డేట్స్ (లాంచింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి).
అంతిమ దశలో యాక్టివ్ రాడార్ హోమింగ్.
శత్రుదేశాలకు గగనతలంలో నుంచే తిప్పలు
R-37M ద్వారా 400 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ధ్వంసం చేయగలగడం ద్వారా భారత వైమానిక దళానికి శత్రు విమానాలను దూరం నుంచే నాశనం చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. పాకిస్తాన్ ఉపయోగించే F-16 లేదా చైనా ఉపయోగించే J-10C వంటి విమానాలతో పోలిస్తే ఇది గణనీయమైన ఆధిక్యతను అందిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న AMRAAM (AIM-120C) మిస్సైల్ (Missile) రేంజ్ సుమారు 100-120 కిలోమీటర్లు మాత్రమే. లాంగ్ రేంజ్ సామర్థ్యం వల్ల పైలట్లు శత్రు రక్షణ వ్యవస్థల రేంజ్‌కు దూరంగా ఉండి దాడి చేయవచ్చు, దీనివల్ల విమానాలు, పైలట్ల నష్టం తగ్గుతుంది. ఆపరేషనల్ సౌలభ్యం: ఆపరేషన్ సిందూర్ వంటి కార్యకలాపాల్లో LoC దాటకుండా శత్రు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ మిస్సైల్ (Missile) భారతదేశానికి రణనీతి పరంగా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. మేక్ ఇన్ ఇండియా: రష్యా ఈ మిస్సైల్‌ను భారతదేశంలో తయారు చేయాలని ప్రతిపాదించింది, ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద స్వావలంబన రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లేదా మరేదైనా రక్షణ రంగ సంస్థ ఈ తయారీలో భాగస్వామ్యం కావచ్చు. దీనివల్ల సాంకేతిక నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
వింపెల్ డిజైన్ బ్యూరో, రష్యా
ఈ ఒప్పందం భారత్-రష్యా రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది.మొత్తంగా R-37M మిస్సైల్ (Missile) భారత వైమానిక దళానికి అత్యాధునిక దాడి సామర్థ్యాన్ని, యుద్ధరంగ ఆధిపత్యాన్ని అందిస్తుంది. దీని హైపర్‌సోనిక్ వేగం, లాంగ్ రేంజ్ సామర్థ్యం, అధునాతన గైడెన్స్ సిస్టమ్ శత్రు విమానాలను దూరం నుంచే నాశనం చేయడంలో అపూర్వమైన సామర్థ్యాన్ని ఇస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద ఈ మిస్సైల్ తయారీ స్థానిక రక్షణ ఉత్పత్తిని బలోపేతం చేస్తుంది, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలను అందిస్తుంది. పాకిస్తాన్, చైనా వంటి ప్రత్యర్థులతో పోటీలో ఈ మిస్సైల్ (Missile) భారతదేశాన్ని గణనీయమైన ఆధిక్యతలో నిలబెడుతుంది, జాతీయ భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.

Read Also: Vijaya Mallya: న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!
2:16

ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!

చెట్టును ఢీకొట్టి మంటల్లో దగ్ధమైన కారు
0:12

చెట్టును ఢీకొట్టి మంటల్లో దగ్ధమైన కారు

📢 For Advertisement Booking: 98481 12870