हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Sriharikota: శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు

Anusha
Sriharikota: శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (Satish Dhawan Space Centre) (షార్) కు ఆదివారం అర్ధరాత్రి వచ్చిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చిన కాల్‌లో, షార్‌లో తీవ్రవాదులు ప్రవేశించారని, బాంబులుపెట్టారని, తీవ్రవాదులు ఉన్నారని చెప్పారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.వారు సోమవారం తెల్లవారుజాము నుంచి షార్‌ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. సీఐఎస్‌ఎఫ్ (CISF) బలగాలు బృందాలుగా ఏర్పడి షార్ చుట్టుపక్కల గాలించారు. నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.సముద్ర మార్గాల్లో కోస్టల్ గార్డ్స్ కూడా తనిఖీలు చేశారు. స్థానిక పోలీసులు షార్ మొదటి గేటు, ఉద్యోగుల కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేశారు.షార్‌లో బాంబులు పెట్టారని, తీవ్రవాదులు ఉన్నారని ఫోన్ రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

లోపలికి వెళ్లేందుకు

ఇది నిజమైన బెదిరింపా లేక ఎవరైనా కావాలని చేశారా అని అధికారులు ఆందోళన చెందారు. షార్ చుట్టూ నీరు ఉంది.లోపలికి వెళ్లేందుకు ఒకే ఒక మార్గం ఉంది.షార్‌లో దాదాపు రెండు వేల మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్లు (CISF jawans)ఉన్నారు. వారంతా అడవులను జల్లెడ పడుతున్నారు. కంట్రోల్ రూమ్స్, కాలనీలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని భయపడుతూ సీఐఎస్‌ఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున అడవుల్లో కూంబింగ్ చేశారు. అయితే చివరికి ఇది ఆకతాయిల ఫోన్ కాల్‌గా తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Sriharikota: శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు
Sriharikota

కేసు నమోదు

ఈ బెదిరింపు ఫోన్ కాల్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కాల్ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బెదిరింపు కాల్స్ చేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. టవర్ లొకేషన్‌ (Tower location) తో పాటూ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ చేసింది ఎవరో తేల్చే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు ఇటీవల ఎపీఎస్‌ఎల్వో ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. అంతేకాదు భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులతో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also: Rain: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870