हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Sreeleela- Kartik: రెస్టారెంట్ బయట శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ వీడియో హల్ చల్

Ramya
Sreeleela- Kartik: రెస్టారెంట్ బయట శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ వీడియో హల్ చల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “పెళ్లి సందD” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత రవితేజతో “ధమాకా” సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ చిత్రం శ్రీలీల కెరీర్‌కు బిగ్ బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుండి, హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ బాలీవుడ్‌లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

కార్తీక్ ఆర్యన్-శ్రీలీల: డేటింగ్ రూమర్స్

తాజాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల నటిస్తున్న సినిమాతో పాటు, వారిద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యంపై మళ్ళీ చర్చ మొదలైంది. షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని టాక్ నడుస్తోంది. దీనిపై కార్తీక్ కానీ, శ్రీలీల (Sreeleela- Kartik) కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ ఇద్దరూ తరచుగా పార్టీల్లో, పబ్లిక్ ప్లేస్‌లలో (At parties and in public places) కలిసి కనిపించడం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుస్తోంది. అంతేకాదు, ఇటీవల కార్తీక్ తల్లి ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ, “మా ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి” అని చెప్పడం, ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోన్న శ్రీలీలను ఉద్దేశించే చేసి ఉంటుందని ముంబై బీ-టౌన్‌లో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఇటీవల ముంబై బాంద్రాలోని ఒక రెస్టారెంట్ బయట శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ (Sreeleela- Kartik) కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి వీరి డేటింగ్ గాసిప్స్‌ను తెరపైకి తీసుకురావడానికి ఇది బలమైన కారణంగా నిలిచింది. చూస్తుంటే ఈ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

శ్రీలీల కెరీర్ గ్రాఫ్ & రాబోయే ప్రాజెక్ట్స్

శ్రీలీల కెరీర్‌పై ఒకసారి చూస్తే, ఇటీవల ‘రాబిన్ హుడ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రవితేజతో కలిసి ‘మాస్ జాతర’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మరియు కిరీటి రెడ్డితో ‘జూనియర్’ వంటి సినిమాల్లో శ్రీలీల బిజీగా ఉంది. వీటితో పాటు బాలీవుడ్‌లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది.

‘జూనియర్’ నుండి ‘వైరల్ వయ్యారి’

ఇక శ్రీలీల, కిరీటి జంటగా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘జూనియర్’ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ‘వైరల్ వయ్యారి’ (‘Viral Vayaari’) పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి ప్రత్యేక శ్రద్ధతో సంగీతం అందించారు. ఈ చిత్రం కిరీటి రెడ్డికి ఒక మంచి లాంచింగ్ ప్యాడ్‌గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఒక గ్రాండ్ ట్రాక్ లో దూసుకుపోతుందనడంలో సందేహం లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read also: 3BHK Review: సిద్ధార్థ్‌ 3BHK సినిమా రివ్యూ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870