📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: యువ ఆటగాళ్లు అంచనాల ఒత్తిడిని తట్టుకోవాలి :ధోని

Author Icon By Anusha
Updated: May 21, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా,రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) చెన్నై సూపర్ కింగ్స్, జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 6 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది.ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు.యువ ఆటగాళ్లను ఉద్దేశించి ధోనీ మాట్లాడుతూ, “మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దు. సీనియర్‌ ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది నుంచి నేర్చుకోండి. యువ ఆటగాళ్లు 200 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌(Strike rate)తో పరుగులు చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టమే. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారి సొంతం” అని అన్నారు. అంచనాల భారాన్ని మోయకుండా సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించాలని యువకులకు సూచించారు.

Sports: యువ ఆటగాళ్లు అంచనాల ఒత్తిడిని తట్టుకోవాలి :ధోని

బౌలింగ్‌

ఇదే క్రమంలో తమ జట్టు ప్రదర్శనపైనా ధోనీ స్పందించారు. “మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి లక్ష్యమే ఉంచాం. కానీ మ్యాచ్‌ ఆరంభంలో త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్‌, మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పడింది. బ్రెవిస్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రన్‌రేట్‌ చక్కగా ఉంది. కానీ మేం మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో దాన్ని కొనసాగించలేకపోయాం” అని ధోనీ వివరించారు.అలాగే, పేసర్‌ కాంబోజ్‌ బౌలింగ్‌(Bowling)ను ప్రశంసిస్తూ, “కాంబోజ్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. మనం ఊహించిన దానికంటే అతడి బంతులు మనల్ని వేగంగా తాకుతాయి. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేయడమంటే అంత తేలిక కాదు. కానీ కాంబోజ్‌ బాగా బౌలింగ్‌ చేశాడు” అని ధోనీ కొనియాడారు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం, రాజస్థాన్‌ రాయల్స్‌ 17.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Read Also: IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

#CricketTips #DhoniAdvice #MSDhoni #T20Batting #YoungCricketers Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.