📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: బీసీసీఐని హెచ్చరించిన గ్రెగ్ చాపెల్ ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: May 3, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్ ప్రపంచానికి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ  ప్రతిభ ఉంటే ఎవరూ ఆపలేరని చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలు అతని బ్యాటింగ్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ వైభవ్ సూర్యవంశీ గురించి బీసీసీఐని హెచ్చరించాడు.సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలను ఉదాహరణగా చూపిస్తూ వైభవ్ సూర్యవంశీని జాగ్రత్తగా తీర్చిదిద్దాలని గ్రెగ్ చాపెల్ సూచించారు.లేకపోతే అతని కెరీర్ కూడా నాశనం కావచ్చని చెప్పారు. ప్రతిభకు సరైన మార్గదర్శకత్వం, రక్షణ కల్పించాలని గ్రెగ్ చాపెల్ అన్నారు. ప్రతిభను కేవలం మార్కెటింగ్ కోసం ఉపయోగించకూడదన్నారు. ప్రతి తరంలోనూ ఎవరో ఒక ఆటగాడు దేశీయ క్రికెట్‌లో రాణిస్తూనే ఉంటాడన్నారు. ఈ రోజుల్లో ఆటగాళ్లకు ఐపీఎల్ లాంటి పెద్ద వేదిక లభించిందని వారు తమ ప్రతిభను ప్రదర్శించే చోటు లభించిందన్నారు. వైభవ్ ఐపీఎ‌ల్‌లో కూడా అద్భుతంగా రాణించాడని టోర్నమెంట్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీని వైభవ్ సాధించాడన్నారు. ఇంత చిన్న వయస్సులోనే అతను రికార్డు సృష్టించాడని చెప్పారు.

వైభవ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐని హెచ్చరించాడు. భారత్ సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప ఆటగాడిని చూసిందని కానీ తాను వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా వంటి ఆటగాళ్లను కూడా చూశానన్నారు. ఎవరు తమ ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని అన్నాడు. సచిన్ టెండూల్కర్ యువకుడిగా విజయం సాధించడానికి కారణం అతని ప్రతిభ మాత్రమే కాదని, బలమైన మద్దతు వ్యవస్థ కూడా అంటూ గ్రెగ్ చాపెల్ రాసుకొచ్చాడు. సచిన్ టెండూల్కర్ స్వభావం ప్రశాంతంగా ఉండేదని అతడి కోచ్ తెలివైన వాడని చెప్పుకొచ్చారు.మరోవైపు వినోద్ కాంబ్లీ బహుశా సచిన్ కంటే ఎక్కువ ప్రతిభావంతుడని కానీ వినోద్ కాంబ్లీ కీర్తి, క్రమశిక్షణ మధ్య సమతుల్యతను కొనసాగించలేకపోయాడని చెప్పుకొచ్చారు. కాంబ్లీ పతనం అతని పెరుగుదల కంటే వేగంగా ఉందన్నారు. పృథ్వీ షా కూడా అలాంటి ఆటగాడేనని అతని పెరుగుదల కూడా అలాగే ఉందని చెప్పాడు. పృథ్వీ షా మళ్లీ పుంజుకోవచ్చని చెప్పారు.వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ కలిసి క్రికెట్ ఆడటం ప్రారంభించారు. సచిన్ టెండూల్కర్ గొప్పవాడు కాగా కాంబ్లీ అనామకుడయ్యాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 34,357 పరుగులు చేశాడు. అతను టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. సచిన్ ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడి 10 పరుగులు చేశాడు. కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. వినోద్ కాంబ్లీ ప్రారంభంలో బాగానే రాణించాడు. టెస్టుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై వినోద్ కాంబ్లీ 224 పరుగులు చేశాడు. ఢిల్లీలో జింబాబ్వేపై 224 పరుగులు కూడా చేశాడు. కానీ కాంబ్లీ స్థిరంగా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అందుకే, అతన్ని జట్టు నుంచి తప్పించారు.

తొలి మ్యాచ్‌

కాంబ్లీ మద్యానికి బానిసయ్యాడు. దాని కారణంగా అతనికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గత సంవత్సరం డిసెంబర్ లో ఆయన ఆస్పత్రిలో చేరారు. పృథ్వీ షా విషయంలో కూడా అదే జరిగింది. పృథ్వీ శా బాల్యం నుంచి ఒక మేధావిగా పరిగణించబడ్డాడు. పృథ్వీ షా 2018లో భారత్ అండర్-19 ప్రపంచ కప్ గెలిచేందుకు నాయకత్వం వహించాడు. కానీ ఇప్పుడు పృథ్వీ షాకు సీనియర్ జట్టులో చోటు లభించలేదు. పృథ్వీ షాతో కలిసి ఆడిన శుభ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్ సూపర్ స్టార్లుగా మారారు.పృథ్వీ షా తన అంతర్జాతీయ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే పృథ్వీషా సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో అతడిని భారత క్రికెట్ భవిష్యత్ గా భావించారు. కానీ క్రమశిక్షణారాహిత్యం, ఫిట్‌నెస్ సమస్యలు, వివాదాలు పృథ్వీషా కెరీర్ ను నాశనం చేశాయి. ఈ సంవత్సరం ఐపీఎల్ మెగా వేలంలో కూడా పృథ్వీషాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

Read Also : IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్

#CenturyIn35Balls #CricketProdigy #CricketSensation #VaibhavSuryavanshi #YoungTalent Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.