हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: గిల్,పంత్ ఇద్దరిలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

Anusha
Sports: గిల్,పంత్ ఇద్దరిలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, కొత్త టెస్ట్ కెప్టెన్ ఎవరవుతారు? అన్న చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ పేరును బలంగా వినిపిస్తోంది. యువ క్రికెటర్లలో గిలే అత్యంత నైపుణ్యం గల బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.మరోవైపు రిషబ్ పంత్ జట్టులో ఉండటంతో శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఉండకపోవచ్చని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లలో ఎవరు ఎక్కువ ప్రజాదరణ పొందిన క్రికెటర్, ఎవరి బ్రాండ్ విలువ ఎక్కువ అనేది తెలుసుకుందాం. భారత క్రికెట్ జట్టులో 25 ఏళ్ల యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మైదానంలోనే కాకుండా ప్రపంచంలో కూడా తన విలువను పెంచుకుంటున్నాడు.2024లో శుభ్‌మన్ గిల్(Shubman Gill) నికర విలువ దాదాపు రూ.34 కోట్లు. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ ఆటగాళ్లలో ఒకరైన శుభ్‌మన్ గిల్‌ను ఐపీఎల్ 2025 సీజన్‌లో దాదాపు రూ.34 కోట్లు. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ ఆటగాళ్లలో ఒకరైన శుభ్‌మన్ గిల్‌ను ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ రూ.16.50 కోట్లకు నిలుపుకుంది. ఇంకా శుభ్‌మన్ గిల్ బీసీసీఐ 2024-25 కేంద్ర ఒప్పందంలో ఏ గ్రేడే కేటగిరీలో చేర్చబడ్డాడు. శుభ్‌మన్ గిల్ సంవత్సరానికి రూ.5 కోట్ల జీతం పొందుతాడు.అంతే కాకుండా శుభ్‌మన్ గిల్ నైక్, జేబీఎల్, జిల్లెట్, కోకా-కోలా, బీట్స్ బైడ్రా, ఎంఆర్‌ఎఫ్, సియేట్, కాసియో, టాటా క్యాపిటల్, మై 11 సర్కిల్ వంటి 10కి పైగా బ్రాండ్లతో ఒప్పంగాలు కుదుర్చుకుంది. శుభ్‌మన్ గిల్ ప్రతి కాంట్రాక్టుకు రూ.50-60 లక్షలు పొందనున్నాడు. ఎంఆర్ఎఫ్ ఒప్పందం ద్వారా సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), విరాట్ కోహ్లీ, బ్రియాన్ లారా వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో చేరాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న శుభ్‌మన్ గిల్, పంజాబ్‌లో విలాసవంతమైన ఇల్లు, రేంజ్ రోవర్‌తో సహా అనేక రకాల వాహనాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

 Sports: గిల్,పంత్ ఇద్దరిలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?
గిల్,పంత్ ఇద్దరిలో అత్యంత ధనవంతుడు

అత్యధిక

భారత బ్యాటర్ రిషబ్ పంత్ రూ.100 కోట్ల నికర ఆస్తులతో అత్యంత ధనిక యువ క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా నిలిచాడు. బీసీసీఐ 2024-25 కాంట్రాక్టులో ఏ గ్రేడ్‌కు పదోన్నతి పొందిన రిషబ్ పంత్ వార్షిక జీతం రూ.5 కోట్లు పొందుతాడు. ఇది కాకుండా వారు టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3లక్షల చొప్పున విడిగా జీతాలు కూడా పొందుతారు.ఒక్కో డీల్‌కు రూ.3.5 నుంచి 4 కోట్లు వసూలు చేసే రిషబ్ పంత్ బ్రాండ్ విలువ 15 మిలియన్ అమెరికన్ డాలర్లు. వచ్చే ఏడాది ఇది 30 నుంచి 40 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిషబ్ పంత్‌కు ఆడి ఏ8, ఫోర్డ్ ముస్తాంగ్ జీటీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే రూర్కీ, ఢిల్లీలో కోట్ల విలువైన ఇళ్లు కూడా ఉన్నాయి.

Read Also : Sports: రోహిత్, కోహ్లీ ర్యాంకులు పదిలం: బీసీసీఐ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870