हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఎమ్ఐ ఓటమి పై హార్దిక్ పాండ్యా ఏమన్నారంటే?

Anusha
IPL 2025: ఎమ్ఐ ఓటమి పై హార్దిక్ పాండ్యా ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబైపై 3 వికెట్ల తేడాతో జీటీ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ప్రధాన బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత ఓవర్లలో 155/8కే పరిమితమైంది. విల్‌ జాక్స్‌ (35 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. గుజరాత్‌ బౌలర్లలో సాయి కిషోర్‌ (2/34), గెరాల్డ్‌ కొయెట్జ్‌ (1/10), అర్షద్‌ ఖాన్‌ (1/18), రషీద్‌ ఖాన్‌ (1/21), సిరాజ్‌ (1/29) సమిష్టిగా సత్తాచాటారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్‌ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 19 ఓవర్లలో 147/7 స్కోరు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(43), బట్లర్‌(30) రాణించారు. బుమ్రా (2/19), బౌల్ట్‌(2/22) ఆకట్టుకున్నారు.గుజరాత్‌ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా, కొట్జె(12) ఔటైనా తెవాటియా(11 నాటౌట్‌), అర్షద్‌ఖాన్‌(1 నాటౌట్‌) జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.

క్యాచ్‌ మిస్‌

గత మ్యాచ్‌లలో ముంబైకి మెరుపు ఆరంభాలను అందించిన ముంబై ఓపెనర్లు రికెల్టన్‌ (2), రోహిత్‌ (7) ఆదిలోనే పెవిలియన్‌కు చేరడంతో ఆ జట్టుకు మొదట్లోనే షాకులు తాకాయి. సిరాజ్‌ రెండో బంతికే రికెల్టన్‌ ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో సుదర్శన్‌ అందుకోగా లెఫ్టార్స్‌ పేసర్లను ఆడటంలో తంటాలుపడే రోహిత్‌ మరోసారి అదే బలహీనతను చాటుతూ అర్షద్‌ నాలుగో ఓవర్లో మిడాఫ్‌ వద్ద ప్రసిద్ధ్‌ చేతికి చిక్కాడు. ఎదుర్కున్న రెండో బంతికే సుదర్శన్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంతో బతికిపోయిన జాక్స్‌కు సూర్య జతకలవడంతో ముంబై స్కోరువేగం పుంజుకుంది. సిరాజ్‌ మూడో ఓవర్లో జాక్స్‌ 6,4 కొట్టగా.. ప్రసిద్ధ్‌ 5వ ఓవర్లో సూర్య మూడు బౌండరీలు రాబట్టాడు. అర్షద్‌ ఆరో ఓవర్లో జాక్స్‌ కూడా మూడు ఫోర్లు బాదాడు. ఈ ద్వయం దూకుడుతో పది ఓవర్లకు ముంబై 89/2తో పటిష్టంగానే నిలిచింది. సాయి కిషోర్‌ 11వ ఓవర్లో లాంగాఫ్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన జాక్స్‌ అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. కానీ ఇదే ఓవర్లో సూర్య భారీ షాట్‌ ఆడబోయి లాంగాఫ్‌లో షారుక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో 71 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. సూర్య నిష్క్రమణతో ముంబై ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది. 

 IPL 2025: ఎమ్ఐ ఓటమి పై హార్దిక్ పాండ్యా ఏమన్నారంటే?

ప్రభావం

ఓటమి గురించి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, తాము మంచి పోరాటం చేశామని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. విజయం కోసం ఒక జట్టుగా కలిసి పోరాడామని కానీ ఈ పిచ్‌పై మాకు ఇంకా రన్స్ ఉండేవన్నారు. నా అంచనా ప్రకారం,ముంబై జట్టు 25 పరుగులు తక్కువ చేసిందని హార్దిక్ చెప్పాడు. అయితే ఓటమికి దగ్గరగా రావడానికి బౌలర్లే బాధ్యత వహించాలన్నాడు. ఈ మ్యాచ్‌లో క్యాచ్‌ల కంటే నో-బాల్స్ ఎక్కువగా బౌల్ చేశామని తాను అనుకుంటున్నానన్నారు. చివరి ఓవర్లో నో-బాల్ గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదన్నాడు. టీ20 క్రికెట్‌లో నో-బాల్స్ వేయడం మరణశిక్ష విధించదగిన నేరంగా తాను భావిస్తానన్నాడు. ఎందుకంటే నో-బాల్స్ ద్వారా వచ్చే పరుగులు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయన్నాడు. ముంబై జట్టులోని అందరు ఆటగాళ్లు 120 శాతం ఇవ్వడం చూసి సంతోషంగా ఉందన్నాడు. ఎందుకంటే తక్కువ స్కోరు చేసినప్పటికీ చివరి వరకు పోరాడామని చెప్పాడు. వర్షం వల్ల ఆటను రెండుసార్లు ఆపివేసి తప్పుగా తిరిగి ప్రారంభించారని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లు మొత్తం 3 నో-బాల్స్ వేశారు. అందులో హార్దిక్ పాండ్యా 2 నో-బాల్స్ వేయడం గమనార్హం.

Read Also :Kohli: కోహ్లీ పై బాలీవుడ్ సింగర్ సంచలన వ్యాఖ్యలు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

📢 For Advertisement Booking: 98481 12870