📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

IPL 2025 : ఐపీల్ మ్యాచ్ టికెట్స్ కావాలా.. ఇలా బుక్ చేస్కోండి!

Author Icon By Vanipushpa
Updated: March 22, 2025 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మిలియన్ డాలర్ల టోర్నమెంట్ ప్రారంభం కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ 18 సీజన్ నేటి నుంచే మొదలవుతుంది. దింతో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లకు టిక్కెట్ల అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. అసలు విషయం ఏంటంటే ఈసారి కూడా మ్యాచ్‌ టిక్కెట్ల ధరలు భారీగానే ఉన్నాయి. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మార్చి 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తొలి హోమ్ మ్యాచ్ ఆడనుంది. గత సంవత్సరం SRH అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎప్పటిలాగే ఈసారి కూడా చాలా మంది అభిమానులు మ్యాచ్‌లను లివ్’గా చూడాలనుకుంటున్నారు. కానీ టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా…!


టిక్కెట్లు ఎప్పుడు అమ్మకానికి వస్తాయంటే

SRH మొదటి రెండు హోమ్ మ్యాచ్‌ల టిక్కెట్లు ఇప్పటికే అమ్మకానికి వచ్చాయి. ఇతర హోమ్ మ్యాచ్‌లకు త్వరలో మరిన్ని టిక్కెట్లు విడుదల చేయనుంది. టిక్కెట్లు వేగంగా అమ్ముడవుతాయి కాబట్టి, ముందుగానే బుక్ చేసుకోవడం బెస్ట్.
టిక్కెట్లను ఎక్కడ కొనాలి: *ఆన్‌లైన్ బుకింగ్: జొమాటో ద్వారా District.inలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అఫీషియల్ SRH వెబ్‌సైట్ మిమ్మల్ని District.inకు రీడైరెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం మ్యాచ్ టికెట్ ధరలు రూ.750 నుండి మొదలై సీటింగ్‌ను బట్టి రూ.30 వేల వరకు ఉంటాయి.
*జియో మహమ్మద్ అజారుద్దీన్ నార్త్ ఫస్ట్ టెర్రస్: రూ.750 *జియో మహమ్మద్ అజారుద్దీన్ నార్త్ సెకండ్ టెర్రేస్: రూ.750 *డ్రీమ్ 11 సౌత్ వెస్ట్ సెకండ్ టెర్రస్: రూ.1550 *కెంట్ సౌత్ ఈస్ట్ సెకండ్ టెర్రస్: రూ.1550 *డ్రీమ్ 11 సౌత్ వెస్ట్ ఫస్ట్ టెర్రస్: రూ.1850 *కెంట్ సౌత్ ఈస్ట్ ఫస్ట్ టెర్రస్: రూ.1850 *అరుణ్ ఐస్‌క్రీమ్స్ ఈస్ట్ స్టాండ్ మొదటి అంతస్తు: రూ.2750 *డ్రీమ్ 11 వెస్ట్ స్టాండ్ మొదటి అంతస్తు: రూ.2750 *లూబీ పంప్స్ వెస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్: రూ.4,500 *BKT టైర్స్ ఈస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్: రూ.4,500 *BKT టైర్స్ నార్త్ స్టాండ్ మొదటి అంతస్తు: రూ.6,500 *ఆల్ సీజన్స్ సౌత్ వెస్ట్ మొదటి అంతస్తు: రూ.8,000 *రైజర్స్ లాంజ్ నార్త్ వెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్: రూ.16,000 *ఆరెంజ్ ఆర్మీ లాంజ్ – నార్త్ ఈస్ట్ గ్రౌండ్ ఫ్లోర్: రూ.16,000 *నార్త్ పెవిలియన్ వెస్ట్ సెకండ్ ఫ్లోర్ కార్ప్ బాక్స్‌లు: రూ.22,000 *సౌత్ పెవిలియన్ వెస్ట్ సెకండ్ ఫ్లోర్ కార్ప్ బాక్స్‌లు: రూ.30,000
అభిమానులకు స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఈ సీజన్ మొదటి మ్యాచులకు రెండు లేదా అంతకంటే ఎక్కువ టిక్కెట్లు కొనుగోలు చేసే అభిమానులకు ఉచిత SRH ఫ్యాన్ జెర్సీ లభిస్తుంది! IPL 2025 కోసం SRH హోమ్ మ్యాచ్ షెడ్యూల్: • మార్చి 23 (ఆదివారం): SRH vs RR – IST మధ్యాహ్నం 3:30 • మార్చి 27 (గురువారం): SRH vs LSG – 7:30 PM IST • ఏప్రిల్ 6 (ఆదివారం): SRH vs GT – 7:30 PM IST • ఏప్రిల్ 12 (శనివారం): SRH vs PBKS – 7:30 PM IST • ఏప్రిల్ 23 (బుధవారం): SRH vs MI – 7:30 PM IST • మే 5 (సోమవారం): SRH vs DC – 7:30 PM IST • మే 10 (శనివారం): SRH vs KKR – 7:30 PM IST
హైదరాబాద్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు: మే 20 (మంగళవారం): క్వాలిఫైయర్ 1 – రాత్రి 7:30 IST మే 21 (బుధవారం): ఎలిమినేటర్ – రాత్రి 7:30 IST SRH అభిమానులు IPL 2025 కోసం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటం అద్భుతమైన అనుభవం. RCB టిక్కెట్లు ఎక్కడ కొనాలి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మొదటి మ్యాచ్ టిక్కెట్లు క్షణాల్లో అమ్ముడయ్యాయి. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి ఆసక్తిగా ఉన్న RCB ఫ్యాన్స్ అఫీషియల్ RCB వెబ్‌సైట్ లేదా BookMyShow ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ టిక్కెట్ల ధరలు కనీసం రూ. 2,300 నుండి ప్రారంభమై రూ. 43,000 వరకు ఉంటాయి.
టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి: మీరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లి టికెట్ విభాగానికి నావిగేట్ కావాలి.

ఇక్కడ మీరు చూడాలనుకుంటున్న మ్యాచ్‌ను సెలెక్ట్ చేసుకొని “BUY NOW TICKETS” పై క్లిక్ చేయండి. మీకు ఇష్టమైన సీట్లను సెలెక్ట్ చేసుకొని మీరు కొనాలనుకుంటున్న టిక్కెట్ల నంబర్ కన్ఫర్మ్ చేసి పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ కోసం కంటిన్యూ నొక్కండి. ఇప్పుడు UPI వంటి ఏదైనా యాప్‌లో పేమెంట్ పద్ధతిని ఉపయోగించి మీరు మీ టిక్కెట్ల కోసం పేమెంట్ చేయవచ్చు. అలాగే మీరు RCB వెబ్‌సైట్‌లో మై అకౌంట్లో “orders” విభాగం కింద మీ మొబైల్ టిక్కెట్లను యాక్సెస్ చేయవచ్చు.
RCB మ్యాచ్ ఏ రోజుల్లో అంటే: RCB vs GT: ఏప్రిల్ 2 RCB vs DC: ఏప్రిల్ 10 RCB vs PBKS: ఏప్రిల్ 18 RCB vs RR: ఏప్రిల్ 24 RCB vs CSK: మే 3 RCB vs SRH: మే 13 RCB vs KKR: మే 17

#telugu News Ap News in Telugu Book them like this! Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Want IPL match tickets

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.