📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యర్‌ లేకపోవడంతో ఆర్‌సీబీకి కలిసొచ్చిందన్న ముకుంద్

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్ కోసం ఆర్‌సీబీ రూ. 23.50 కోట్ల వరకు బిడ్ వేసింది. కానీ కేకేఆర్ మాత్రం 23.75 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌ల్లో 142 పరుగులే చేశాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్(Abhinav Mukund) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో వెంకటేశ్ అయ్యర్ దక్కకపోవడమే ఆర్‌సీబీకి కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు.ఎందుకంటే వారు లాస్ట్ బిడ్ వేయలేక అతన్ని దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత జోష్ హజెల్ వుడ్, జితేశ్ శర్మ, ఫిల్ సాల్ట్‌తో భువనేశ్వర్ కుమార్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కూడా వారి ఖాతాలో చాలా డబ్బులు మిగిలాయి. వెంకటేశ్ అయ్యర్‌నే తీసుకొని ఉంటే ఈ ఆటగాళ్లు వచ్చేవారు కాదు.’అని ముకుంద్ తెలిపాడు.

ఫైనల్ ముగిసిన

ఆర్‌సీబీ విజయం తర్వాత ఆ జట్టు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తాను తీసుకున్న ఐపీఎల్ జీతంపై విచారం వ్యక్తం చేశాడని అభినవ్ ముకుంద్ తెలిపాడు. కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముకుంద్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఏబీ డివిలియర్స్(AB de Villiers) తనతో అన్న మాటలను పంచుకున్నాడు.ఐపీఎల్ 2025 ఫైనల్ ముగిసిన తర్వాత ఏబీ డివిలియర్స్ పక్కనే నేను కూర్చునున్నాను. అతను ఏ దిగ్గజ ఆటగాడు చెప్పని ఓ విషయాన్ని నాతో పంచుకున్నాడు. నిజాయితీగా తన మనసులో నుంచి వచ్చిన మాట అది. ఐపీఎల్ తాను ఎక్కువ జీతం తీసుకున్నానని చాలా భావోద్వేగానికి కూడా గురయ్యాడు.

Venkatesh Iyer

ఏబీ డివిలియర్స్

ఐపీఎల్‌లో నేను ఎక్కువ డబ్బులు తీసుకున్నాను. మీ(ముకుంద్) మాటలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తోంది. నాకిచ్చిన డబ్బులతోనే చాలా మంది స్టార్ క్రికెటర్లను కొనగలగుతున్నారు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ(RCB) మ్యాచ్ విన్నర్లందరి కోసం ఖర్చు చేసింది చాలా తక్కువ. ఫిల్ సాల్ట్, జోష్ హజెల్ వుడ్ ధర రూ. 15 కోట్లు దాటలేదు.’అని ఏబీ డివిలియర్స్ నాకు చెప్పాడు.’అని ముకుంద్ చెప్పుకొచ్చాడు.ఆర్‌సీబీ తరఫున 11 ఏళ్లు ఆడిన ఏబీ డివిలియర్స్‌ను 2014లో రూ. 7.50 కోట్లు, 2018లో రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్‌సీబీ ఏ ఆటగాడికి రూ. 12.50 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయలేదు. కానీ వెంకటేశ్ అయ్యర్ కోసం రూ. 21.50 కోట్ల వరకు బిడ్ వేసి వదిలేసింది.

Read Also: CV Anand: ఆర్‌సీబీ విజయం.. హైదరాబాద్‌ సెలెబ్రేషన్స్‌పై సీవీ ఆనంద్ ఫైర్

#AbhinavMukund #IPL2025 #RCB #VenkateshIyer Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.