ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్‌ను శక్తివంతమైన సిక్స్ కొట్టడం ద్వారా ప్రారంభించాడు. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 14 ఏళ్ల వయసులోనే అలవోకగా సిక్స్‌లు బాదడం చూసి అవాక్కయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో గురువారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఎంతో అనుభవం కలిగిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు.ఈ మ్యాచ్‌కు తమిళ కామెంటేటర్‌గా వ్యవహరించిన మురళీ విజయ్ ఈ కుర్రాడి బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు. ఈ తరం ఆటగాళ్లు ఏం తిటున్నారని ప్రశ్నించాడు. అలవోకగా సిక్స్‌లు బాదేస్తున్నారని ప్రశంసించాడు. ‘నా కొడుకు వయసు 12 ఏళ్లు ఈ కుర్రాడి వయసు 14 ఏళ్లు. అతను ఈ వయసులోనే ఐపీఎల్ ఆడటమే కాకుండా భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ బౌలింగ్‌లో అలవోకగా సిక్స్‌లు బాదేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కుర్రాడు ప్రతీ బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు.
సూర్యవంశీ సక్సెస్
అతని ఫియర్‌లెస్ బ్యాటింగ్ అద్భుతం. అతని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. బహుషా ఆ కుర్రాడి తండ్రి అలా శిక్షణ ఇచ్చి ఉంటాడు. మైదానంలోకి వెళ్లి సిక్సర్లు మాత్రమే కొట్టాలని చెప్పినట్లున్నాడు. భువీ బౌలింగ్‌లో ఆ బాలుడు కొట్టిన సిక్స్‌లు అమోఘం. దూకుడుగా ఆడుతూ అలవోకగా సిక్స్‌లు కొడుతున్న ఈ తరం కుర్రాళ్లు ఏం తింటున్నారో నాకు తెలియదు. కానీ సూర్యవంశీ సక్సెస్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నాను.’అని మురళీ విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), దేవదత్ పడిక్కల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించగా.. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. సూర్యవంశీ 12 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 పరుగులు చేసి భువీ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
కెరీర్
వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. వైభవ్ కంటే ముందు ఈ రికార్డు ప్రేయాస్ రే బర్మాన్ పేరిట నమోదైంది. అతను 2019 సంవత్సరంలో 16 సంవత్సరాల 157 రోజుల వయస్సులో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉండగా వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన కెరీర్‌లోని మొదటి బంతికే సిక్స్ కొట్టిన 10వ బ్యాటర్ గా నిలిచాడు. ఐపీఎల్‌లో తన తొలి బంతికే వైభవ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికే భారీ సిక్స్ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.వైభవ్ పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎవరైతే వైభవ్ స్కూల్ గురించి ట్రోల్ చేశారో వాళ్లు ఇప్పుడు 9వ తరగతిలో ఉన్నారు. కానీ అతను ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.
Read Also: IPL 2025: రాజస్థాన్ రాయల్స్ పై ఆర్‌సీబీ ఘన విజయం