हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

Anusha
IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌లో భాగంగా, వైభవ్‌ సూర్యవంశీ (38 బంతుల్లో 101, 7 ఫోర్లు, 11 సిక్సర్లు) ఐపీఎల్‌-18లో పాత రికార్డుల దుమ్ముదులిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏండ్లకే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ బీహార్‌ చిచ్చరపిడుగు, జైపూర్‌లో సృష్టించిన పరుగుల సునామీకి 2025 సీజన్‌లో వరుస ఓటముల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ గెలుపు బాట పట్టింది. వైభవ్‌ విధ్వంసక శతకానికి తోడు యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్థశతకంతో రెచ్చిపోగా గుజరాత్‌ టైటాన్స్‌ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 15.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 రన్స్‌ చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.

తొలి మ్యాచ్‌

ఇటీవలే 18 ఏండ్లు నిండిన ఐపీఎల్‌ కంటే తక్కువ వయసున్న వైభవ్‌ జైపూర్‌లో టైటాన్స్‌ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, వాషింగ్టన్‌, రషీద్‌ ఖాన్‌ వంటి బౌలర్లను క్లబ్‌స్థాయి బౌలర్లుగా మార్చేసి జైపూర్‌లో పరుగుల సునామీని సృష్టించాడు. మ్యాచ్‌లో వైభవ్‌ 101 పరుగులు చేస్తే అందులో సిక్సర్లు, బౌండరీల రూపంలోనే ఏకంగా 94 పరుగులు వచ్చాయంటే బంతిని అతడు ఎంత కసిగా బాదాడో అర్థం చేసుకోవచ్చు. సిరాజ్‌ తొలి ఓవర్లో తాను ఎదుర్కున్న రెండో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌గా మలిచిన వైభవ్‌ ఇషాంత్‌ శర్మ వేసిన 4వ ఓవర్లో 6, 6, 4, 6, 4తో ఏకంగా 28 పరుగులు చేసాడు. వాషింగ్టన్‌ ఐదో ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు, ఓ బౌండరీతో 17 బంతుల్లోనే ఐపీఎల్‌లో అతడు తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. వైభవ్‌, జైస్వాల్‌ జోరుతో పవర్‌ ప్లేలోనే రాయల్స్‌ 87/0గా నిలిచింది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అఫ్గాన్‌ బౌలర్‌ కరీమ్‌ జన్నత్‌ ఓవర్లో అయితే బాదుడును వైభవ్‌ మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఆ ఓవర్లో 6, 4, 6, 4, 4, 6తో ఏకంగా 30 రన్స్‌ రాబట్టి 90లలోకి వచ్చాడు. రషీద్‌ 11వ ఓవర్లో రెండో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌తో 35 బంతుల్లోనే అతడి తొలి శతకం పూర్తయింది. సెంచరీ తర్వాత వైభవ్‌, ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయినా జైస్వాల్‌ సారథి రియాన్‌ పరాగ్‌ (32*) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

 IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన  వైభవ్‌ సూర్యవంశీ

శతకం

 ఓపెనింగ్‌ ద్వయం సుదర్శన్‌ (39), గిల్‌ తొలి వికెట్‌కు 10 ఓవర్లలోనే 93 పరుగులు జోడించి టైటాన్స్‌కు శుభారంభం అందించారు. పవర్‌ ప్లేలో ఈ ఇద్దరూ ఓవర్‌కు రెండు బౌండరీలకు తగ్గకుండా ఆడటంతో 6 ఓవర్లకు గుజరాత్‌ వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. భారీ మెరుపులేమీ లేకపోయినా ఈ జోడీ నిలకడగా రన్స్‌ రాబట్టింది. హసరంగ పదో ఓవర్లో స్వీప్‌ షాట్‌తో 29 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. రెండో స్పెల్‌లో బంతినందుకున్న తీక్షణ 11వ ఓవర్లో రెండో బంతికి సుదర్శన్‌ పరాగ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. బట్లర్‌ రాకతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. ఫిఫ్టీ తర్వాత గిల్‌ యుధ్వీర్‌ 14వ ఓవర్లో రెండు సిక్సర్లు దంచగా హసరంగ ఓవర్లో బట్లర్‌ 6, 6, 4, 6 బాది 24 పరుగులు పిండుకున్నాడు. శతకం వైపునకు సాగుతున్న గిల్‌ను తీక్షణ 17వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. గిల్‌ నిష్క్రమించినా ఆఖర్లో బట్లర్‌ దూకుడుతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.

Read Also: IPL 2025 : వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధిక్యంలో ఆసీస్

ఆధిక్యంలో ఆసీస్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870