📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Suryavanshi: నేను ఏడ్చలేదు..నా కళ్లు మండటంతో చేతితో రుద్దుకున్నాను: వైభవ్

Author Icon By Anusha
Updated: May 20, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా,రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు, 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. రూ. 1.10 లక్షలకు ఈ బీహార్ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయగా జట్టుకు గొప్ప ఆస్తిగా మారిపోయాడు.ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోకపోయినా సూర్యవంశీ ఆట ఆ జట్టు అభిమానులను సంతోష పెట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. మైదానం వీడే సమయంలో ఏడ్చాడు. కళ్లను తుడుచుకుంటూ పెవిలియన్‌వైపు నడిచాడు. పిల్లాడి పసితనం బయటపడిందని నెటిజన్లు కామెంట్ చేశారు. 14 ఏళ్ల వయసులో ఏడ్వడం సహజమేనని కామెంట్ చేశారు.చెన్నై సూపర్ కింగ్స్‌తో(CSK) ఈ సీజన్‌లో ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైన వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్‌లో ఔటైన అనంతరం ఏడ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎప్పుడు ఏడ్చాను? కామెడీ చేయకండి’అని ఎదురు ప్రశ్నించాడు. ‘నేను ఎప్పుడు ఏడ్చాను? నా కళ్లు మండటంతో చేతితో రుద్దుకున్నాను. నేను ఔటైన వెంటనే స్టేడియంలోని బిగ్ స్క్రీన్ చూశాను. ఆ లైటింగ్ నా కళ్లపై పడటంతో మసకబారాయి. దాంతోనే నా కళ్లను రుద్దుకున్నాను. ఇది చూసి జనాలంతా నేను ఏడ్చానని భావించారు. నేను ఏడ్వలేదు. కళ్లపై లైటింగ్ పడటంతోనే అలా చేయాల్సి వచ్చింది.’అని వైభవ్ సూర్యవంశీ అసలు విషయం చెప్పాడు.

Suryavanshi: నేను ఏడ్చలేదు..నా కళ్లు మండటంతో చేతితో రుద్దుకున్నాను: వైభవ్

అరంగేట్రం

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) 219 స్ట్రైక్‌రేట్‌తో 195 పరుగులు చేశాడు. సీజన్ మధ్యలో అవకాశాలు అందుకున్న అతను ఇదే నిలకడ కనబరిస్తే వచ్చే సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే తుది జట్టులో ఉండనున్నాడు.టీమిండియా తరఫున ఇప్పుడే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయలేడు. బీసీసీఐ, ఐసీసీ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన ఆటగాళ్లనే అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తారు.

Read Also: IPL 2025: ముంబై జట్టులోకి కీలక ఆటగాళ్లు

#CSKvsMI #IPL2025 #IPLDrama #VaibhavSuryavanshi Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.