వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం,ఆడిన మూడో మ్యాచ్‌లోనే మెరుపు సెంచరీతో దుమ్మురేపిన క్రికెట్ చిచ్చరపిడుగు తాజాగా ప్రధాని మోదీని కలిశాడు.బీహార్ పర్యటనలో ఉన్న మోదీ పాట్నా విమానాశ్రయం(Patna Airport)లో వైభవ్‌ను మీట్ అయ్యారు. వైభవ్ పేరెంట్స్ కూడా మోదీని కలిశారు.క్రికెట్‌నే కెరీర్‌గా మల్చుకొని అతి చిన్న వయసులో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వైభవ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. పైగా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. టీమిండియాకు ఆడి దేశానికి ప్రాతినిథ్యం వహించడమే కలగా ముందుకు సాగుతున్న వైభవ్‌ను ప్రధాని మోదీ అభినందించారు.
జైపూర్
ప్రధాని మోదీని కలిసిన సమయంలో ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు వైభవ్. యంగ్ క్రికెటర్‌ను కలిసిన విషయాన్ని ప్రధాని మోదీ(Prime Minister Modi) తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. యువ సంచలన క్రికెటర్, అతని కుటుంబాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో కలుసుకున్నట్లు ఆ పోస్టులో రాశారు. వైభవ్ క్రికెట్ నైపుణ్యాన్ని యావత్ దేశం కీర్తిస్తున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు.ఐపీఎల్‌లో(IPL) ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ మొత్తం 252 రన్స్ స్కోర్ చేశాడు. అయితే జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై అతను చెలరేగిన తీరు అద్భుతం.తన స్ట్రోక్ ప్లేతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడతను.
Read Also: Rajat Patidar: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్