Under 19 WC: నేడే U19 వరల్డ్‌కప్ ఫైనల్

Read Time:  1 min
Under 19 WC: నేడే U19 వరల్డ్‌కప్ ఫైనల్
FONT SIZE
GET APP

అండర్‌–19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో భాగంగా, ఇవాళ హరారే వేదికగా భారత జట్టు, ఇంగ్లాండ్ జట్టు తలపడనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. యువక్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ టోర్నీ ఫైనల్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు జట్లు టైటిల్ లక్ష్యంగా మైదానంలోకి దిగుతుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకూ ఇండియా ఒక్క మ్యాచూ ఓడలేదు.

Read Also: WPL 2026: RCB గెలుపు పై స్పందించిన అనుష్క శర్మ

 U19 World Cup final today..
U19 World Cup final today..

9 మ్యాచు ల్లో ఏడింట్లో ఇండియా దే పై చేయి

టోర్నీ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది. U-19 WCలలో ఇండియా , ఇంగ్లాండ్ 9 మ్యాచులు ఆడగా ఏడింట్లో ఇండియానే గెలవడం గమనార్హం.ఇది భారత జట్టుకు వరుసగా ఆరో ఫైనల్ అవుతుంది. 2022లో ఇంగ్లాండ్‌ను ఓడించి చివరి టైటిల్ గెలుచుకుంది. 2024లో, ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు, భారత జట్టు మరోసారి టైటిల్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది. ఇంగ్లాండ్ 28 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ జట్టు 1998 నుంచి ఛాంపియన్‌గా నిలివలేదు.ఈ కీలక ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అభిమానులు వీక్షించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో టీవీలో లైవ్‌గా, జియో హాట్‌స్టార్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది..

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.