U-19 WC Final: టాస్ గెలిచిన భారత్

Read Time:  1 min
U-19 WC Final: టాస్ గెలిచిన భారత్
FONT SIZE
GET APP

అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌ (U-19 WC Final) లో, భారత జట్టు, ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఫైనల్ మ్యాచ్ కావడంతో స్టేడియం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంతో నిండిపోయింది.భారత జట్టు రికార్డు స్థాయిలో 10వ సారి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు 1998లో తమ ఏకైక టైటిల్‌ను గెలుచుకున్న ఇంగ్లాండ్ మూడోసారి ఫైనల్‌కు చేరుకోనుంది. గతంలో, 2022 ఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్‌ జట్టును ఓడించి ఐదవసారి ట్రోఫీని గెలుచుకుంది.

Read Also: Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్

ఇంగ్లాండ్ U19 (ప్లేయింగ్ XI): బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్, థామస్ రెవ్ (కెప్టెన్, కీపర్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్.

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.