हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఈ ఏడాది ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకునే జట్టు ఇదే: యువరాజ్ సింగ్

Anusha
IPL 2025: ఈ ఏడాది ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకునే జట్టు ఇదే: యువరాజ్ సింగ్

ఐపీఎల్ 2025లో భాగంగా, ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోపోటీ తీవ్రంగా మారింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను చూస్తే, 6 జట్లు మంచి ప్రదర్శన కనబరచి ప్లేఆఫ్స్ రేసులో నిలిచాయి. అయితే, ఈ 6 జట్లలో కేవలం నాలుగు జట్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఈ ఐపీఎల్ సిరీస్‌లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ట్రోఫీ గెలవని పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌ల చొప్పున విజయం సాధించాయి. ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉంది.

ఇష్టమైన

యువీ పోస్ట్ చేసిన వీడియోలో ఈ సంవత్సరం తనకు ఇష్టమైన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ అని చెప్పాడు. కానీ ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ ట్రోఫీని గెలుచుకుంటుందని కూడా వెల్లడించాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. అయినప్పటికీ యువరాజ్ సింగ్ ఆ జట్టును తనకు ఇష్టమైన జట్టు అని అనడానికి ఒక ప్రధాన కారణం ఉంది. యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన అభిషేక్ శర్మ ఆ జట్టు తరఫున ఆడుతున్నాడు. అందుకే యువరాజ్ సింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తనకు ఇష్టమైన జట్టుగా పేర్కొన్నాడు. అదే సమయంలో తాను పంజాబ్ కు చెందినవాడు కాబట్టి ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ జట్టు ట్రోఫీని గెలుచుకుంటుందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సంవత్సరం బాగా ఆడుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని తమ జట్టు గెలుచుకుంటుందని సూచించాడు.

 IPL 2025:  ఈ ఏడాది  ఐపిఎల్  ట్రోఫీని గెలుచుకునే జట్టు ఇదే: యువరాజ్ సింగ్

బ్యాటింగ్

తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరుగుతోన్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. మిగతా బ్యాట్లర్లు ఇంకాస్త బాగా ఆడి ఉండాల్సింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ ఫినిషింగ్ అంతగా బాలేదు. ఇంకాస్త మంచిగా ఆడి ఉంటే 220 వరకు స్కోరు వెళ్లేది.ఈ మ్యాచులో మొదటగా టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కేకేఆర్ బౌలర్లకు పంజాబ్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 69 పరుగులు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 83 రన్స్) అటాకింగ్ షాట్లు ఆడుతూ మంచి శుభారంభం అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 120 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Read Also: Punjab Kings : పంజాబ్-కోల్‌కతా మ్యాచ్‌లో వరుణుడిదే గెలుపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870