📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Shubhman Gill: స్పిన్నర్ల వల్లే విజయం దక్కింది: గిల్

Author Icon By Aanusha
Updated: October 4, 2025 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. ఇన్నింగ్స్ 140 రన్స్ తేడాతో సమగ్ర విజయాన్ని సాధించిన భారత జట్టు ప్రదర్శనపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) స్పందించారు.

IND vs WI: ఓటమి పై వెస్టిండీస్ కెప్టెన్ ఏమన్నారంటే?

నాణ్యమైన స్పిన్నర్లను సమన్వయం చేయడం తలనొప్పేనని, కానీ వారి వల్లే విజయం దక్కిందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఎక్కువ బౌలింగ్ ఆప్షన్ ఉండటం మంచేదనని అభిప్రాయపడ్డాడు. ‘మేం వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాం.

కానీ మేం విజయాలు సాధిస్తున్నంత వరకు టాస్ ఓడిపోవడం పెద్ద విషయమే కాదు. మాకు ఇది ఒక పర్ఫెక్ట్ గేమ్ (Perfect game). అందుకే ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. నిజాయితీగా చెప్పాలంటే.. ఇది మాకు అద్భుతమైన మ్యాచ్.

స్పిన్నర్లు ఉన్నప్పుడు రొటేట్ చేయడం కష్టం

ఈ మ్యాచ్‌లో ముగ్గురు శతకాలు సాధించారు. రెండు ఇన్నింగ్స్‌ (innings) ల్లో మేం అద్భుతంగా ఫీల్డింగ్ చేశాం. మాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు.మంచి ఆరంభం లభిస్తే బ్యాటింగ్ చేయడానికి ఇది మంచి వికెట్. జైస్వాల్, నేను మంచి ఆరంభమే అందుకున్నాం కానీ పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాం.

Shubhman Gill

కానీ ఇతర బ్యాటర్లు భారీ స్కోర్లు చేశారు. వారి ఆట పట్ల సంతోషంగా ఉంది. జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నప్పుడు రొటేట్ చేయడం కష్టం. కానీ ఎక్కువ బౌలింగ్ (Bowling) ఆప్షన్లు ఉండటం మంచిది. కానీ బౌలర్లను సమన్వయం చేయడం కాస్త కష్టమే. భారత జట్టులో ఆడటం సరదాగా ఉంటుంది. జట్టు కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు సిద్దంగా ఉంటారు.

రెండేళ్లలో మేం జట్టుగా ఒకటయ్యాం

ఇది యువ జట్టు.. అద్భుతమైన ప్రదర్శనతో గొప్ప విజయం సాధించారు.కెప్టెన్‌గా నేను చాలా నేర్చుకున్నాను. నేర్చుకున్న ఒకటి రెండు, విషయాలు ఏంటంటే చెప్పడం కష్టం. కానీ ఈ రెండేళ్లలో మేం జట్టుగా ఒకటయ్యాం. క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాం అనేది చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది.

మేం ఇంకా నేర్చుకునే దశలో ఉన్న జట్టు. మాకు లభించే అనుభవాల నుంచి మేం నేర్చుకుంటూ ఉన్నంత వరకు.. మాకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి.’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

140 run lead Ahmedabad match Breaking News dominant performance India vs West Indies Test innings win latest news Shubman Gill Team India Captain Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.