📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

IPL 2025: ఐపీఎల్ ఆటగాళ్లకి పన్ను చిక్కులు: చేతికి వచ్చేది ఎంత!

Author Icon By Vanipushpa
Updated: March 24, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ తాజాగా ప్రారంభమైన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈసారి ఊహించని విధంగా IPL ప్లేయర్స్ వేలం కోట్లలో జరిగింది. ఐపీల్ టీంలు ఒక్కో ప్లేయర్’ని కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసాయి. కానీ ఈ ప్లేయర్స్ అందరు పన్ను చెల్లించాల్సి ఉంటుందా.. అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల మనస్సులో తలెత్తుతుంది. దీనికి సమాధానం అవును అనే వినిపిస్తుంది.. అయితే వీరు ఎంత పన్ను చెల్లించాలి ? ఇతర దేశ ఆటగాళ్లతో పోల్చితే ఎంత కట్టాల్సి ఉంటుంది.
భిన్నంగా దేశ ప్లేయర్లకు పన్ను నియమాలు
ఐపీఎల్‌లో ఆడే ఇండియన్ ప్లేయర్లకు ఇంకా బయటి దేశ ప్లేయర్లకు పన్ను నియమాలు భిన్నంగా ఉంటాయి. భారత చట్టం ప్రకారం భారతదేశంలో అలాగే విదేశాలలో భారతీయ ఆటగాళ్ల ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. అంతేకాదు IPLలో ఆడే ఇతర దేశ ఆటగాళ్లను ‘నాన్-రెసిడెంట్’గా వర్గీకరిస్తారు. ఈ కారణంగా పన్ను విధానం భిన్నంగా ఉంటుంది. భారతీయ ఆటగాళ్ల ఆదాయంపై 10% TDS (tax deduction at source) వర్తిస్తుండగా, విదేశీ ఆటగాళ్లకు ఈ రేటు 20%. ప్లేయర్స్ కాంట్రాక్ట్ మొత్తాన్ని అందుకునే ముందు ఈ TDS కట్ చేస్తారు.

ఫ్రాంచైజీతో ఒప్పందంపై సంతకం

ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్ళు కాంట్రాక్ట్ మొత్తాన్ని పొందడానికి ముందుగా బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇంకా సంబంధిత ఫ్రాంచైజీతో ఒప్పందంపై సంతకం చేయాలి. ఒకవేళ ఫ్రాంచైజ్ టీం పేమెంట్ చేయడంలో విఫలమైతే, BCCI జోక్యం చేసుకుని పేమెంట్ జరిగేల చూస్తుంది ఇంకా ఫ్రాంచైజ్ సెంట్రల్ రెవెన్యూ ఫండ్ నుండి అవసరమైన మొత్తాన్ని కట్ చేస్తుంది.
నిపుణుల అభిప్రాయం
బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్లేయర్లకు చెల్లించే మొత్తాన్ని వృత్తిపరమైన ఆదాయంగా లెక్కిస్తారు. అందువల్ల IPL నుండి వచ్చే ఆదాయాలను ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం ఆదాయానికి కలిపి భారత ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను స్లాబ్‌ల ప్రకారం పన్ను విధించబడుతుంది. విదేశీ ఆటగాళ్లకు పన్ను నియమాలు: విదేశీ ఆటగాళ్లకు భారత ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 115BBA కింద పన్ను విధించబడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం భారత పౌరుడు కానీ (NRI) ఆటగాళ్లకు భారతదేశంలో ఏదైనా స్పోర్ట్స్ లేదా సంబంధిత కార్యక్రమంలో పాల్గొంటే అతనికి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి. ముఖ్యంగా భారతదేశంలో స్పోర్ట్స్, ప్రకటనలు లేదా క్రీడలకు సంబంధించిన ప్రొమోషన్స్ నుండి వచ్చే ఆదాయానికి 20% ఫ్లాట్ రేటుతో పన్ను విధించబడుతుంది. అదనంగా ఈ ఆటగాళ్ళు భారతదేశంలో ఆదాయాన్ని పొందినప్పుడు, దానిపై 20% TDS కూడా వర్తిస్తుంది.
విదేశీ ఆటగాళ్ళు భారతదేశంలో ‘డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్’ (DTAA) కింద ట్యాక్స్ రిలీఫ్ పొందే అవకాశం ఉంది. ఒక ప్లేయర్ ఒక ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 182 రోజుల కంటే ఎక్కువ రోజులు గడిపినట్లయితే అతన్ని భారత ‘నివాసి’గా పరిగణిస్తారు అంటే భారత పౌరులలాగానే పన్ను నియమాలకు లోబడి ఉంటారు అని అర్ధం.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu How much do they earn? Latest News in Telugu Paper Telugu News Tax implications for IPL players Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.