📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T20 WC Final: ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

Author Icon By Anusha
Updated: March 8, 2026 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 WC Final: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అహ్మదాబాద్ నగరం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ పోరును వీక్షించేందుకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో భారీ భద్రత మధ్య ధోనీ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also: T20 Final Pitch Report: భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

ప్రముఖులు కూడా హాజరు

ఇంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్‌ను కూడా ధోనీ ప్రత్యక్షంగా వీక్షించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ను ధోనీ తన భార్య సాక్షితో కలిసి వీక్షించాడు. ఆ మ్యాచ్‌ను చూసేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కూడా మ్యాచ్‌ని వీక్షించారు.

T20 WC Final: Final match.. Dhoni arrives at Ahmedabad airport

భారత్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలి టైటిల్‌ను 2007లో గెలిచింది. ఆ సమయంలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నది ధోనీనే. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2007 ఫైనల్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఓడించి తొలి ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు అదే విజయాన్ని మరోసారి పునరావృతం చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ వరుసగా రెండో టైటిల్‌ను గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తోంది. స్వదేశంలో జరిగే ఈ టోర్నమెంట్‌లో టైటిల్ గెలిచే తొలి జట్టుగా నిలవాలన్న లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dhoni at Narendra Modi Stadium India vs New Zealand MS Dhoni Ahmedabad Airport T20 WC Final

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.