T20 WC: భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

Read Time:  1 min
T20 WC: భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?
FONT SIZE
GET APP

టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 WC) లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.పీసీబీ నిర్ణయాన్ని విచారకరమని పేర్కొన్న అఫ్రిది.. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ, ఈ వ్యవహారంలో ఐసీసీ న్యాయంగా వ్యవహరించాలని కోరారు.

Read Also: T20WorldCup: భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

T20 WC: Boycott of match against India.. What did Shahid Afridi say?
T20 WC: Boycott of match against India.. What did Shahid Afridi say?

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం

ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం బాయ్‌కాట్ చేయాలని ఆదేశించింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించిన విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మ్యాచ్‌ను దూరం పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.ఈ అంశంపై అఫ్రిది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ “రాజకీయాలు మూసే తలుపులను క్రికెట్ తెరుస్తుంది అని నేను ఎప్పుడూ నమ్ముతాను. భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం. అయినా ప్రభుత్వ నిర్ణయానికి నేను మద్దతు ఇస్తున్నాను. ఇప్పుడు ఐసీసీ మాటలతో కాదు, నిర్ణయాలతో న్యాయం చూపించాల్సిన సమయం ఇది” అని పేర్కొన్నాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.