📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T20 WC 2026 Final: ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

Author Icon By Aanusha
Updated: March 8, 2026 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మార్చి 8న (ఈరోజు) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ కు, ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.”వరుణ్ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది ఒక జట్టు ఆట (Team Sport). జట్టు గెలిచినప్పుడు వ్యక్తిగత ప్రదర్శనల గురించి ఎక్కువగా ఆలోచించం. ప్రతి ఆటగాడికి ప్రతీరోజూ ఒకేలా ఉండదు. అతడు ప్రపంచ నంబర్ 1 బౌలర్, వరల్డ్ క్లాస్ బౌలర్. మ్యాచ్‌లు ఎలా గెలవాలో అతడికి బాగా తెలుసు.

Read Also: Ahmedabad Hotel Prices: T20 WC ఫైనల్ .. ఆకాశాన్ని తాకిన విమాన ప్రయాణ ఛార్జీలు

ఒత్తిడి లేకపోతే అందులో మజా ఉండదు

ఫైనల్లో అతడు కచ్చితంగా రాణిస్తాడు” అని ధీమా వ్యక్తం చేశాడు.భారత బ్యాటర్లు ఆఫ్ స్పిన్‌కు ఇబ్బంది పడుతున్నారన్న విశ్లేషణలపైనా సూర్య స్పందించారు. “మేం దాని గురించి పెద్దగా చర్చించలేదు. గత మ్యాచ్‌లో ఇషాన్, దూబే, తిలక్ వర్మ వంటి లెఫ్ట్ హ్యాండర్లు ఆఫ్ స్పిన్నర్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు.

ఫైనల్లో ఎలాంటి బౌలింగ్ దాడి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపాడు. స్వదేశంలో ప్రపంచకప్ ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా ప్రత్యేకమైన అనుభూతి అని సూర్య అన్నాడు.“ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. కానీ ఒత్తిడి లేకపోతే అందులో మజా ఉండదు. ఫైనల్ కోసం యావత్ భారతదేశం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. మేం సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతాం” అని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India vs New Zealand Suryakumar Yadav T20 World Cup 2026 final Varun Chakravarthy form concern

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.