ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025 లో భాగంగా,ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చివరి మ్యాచ్ గెలిచినా ముంబైని అధిగమించే పరిస్థితి లేకపోవడంతో ఢిల్లీ ఇంటిబాట పట్టింది.ఈ మ్యాచ్‌లోనూ తడబడిన ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్), నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌కు తోడుగా మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(3/12) నిప్పులు చెరగడంతో సునాయస విజయాన్నందుకుంది.
ఇన్నింగ్స్
అజేయ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.ఈ సందర్భంగా మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ ఈ అవార్డ్‌ను తన సతీమణి దేవిషా శెట్టికి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో ఇతర అవార్డ్స్ అందుకున్న తాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలవలేదని, ఈ విషయాన్ని తన సతీమణి గుర్తు చేసిందని చెప్పాడు.ఈ సీజన్‌లో ఇది 13వ మ్యాచ్.ఈ సీజన్‌లో నాకు అన్ని అవార్డులు వచ్చాయని, కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదని గుర్తు చేసింది. ఈ రోజు ఆ అవార్డ్ దక్కడం చాలా ప్రత్యేకం. జట్టు దృష్ట్యా ఈరోజు నేను ఆడిన ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైనది. ఈ ట్రోఫీ నా భార్యకు అంకితం. నేను చివరి వరకు ఆడటం ముఖ్యం. నా సతీమణి ఇలాంటి క్షణాల కోసం ఎదురు చూస్తోంది.
సంతోషం
నా సతీమణితో కలిసి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటా. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా. క్రీజులో సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఉండటం ముఖ్యం. ఏదో ఓవర్‌లో 15-20 పరుగులు వస్తాయని మాకు తెలుసు. నమన్ నాకు అండగా నిలిచాడు.ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. తర్వాతి మ్యాచ్‌లు ఇంకా బాగుంటాయి.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది.
Read Also: Bumrah: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా