సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి సురేష్ రైనా ఈ జట్టు తరఫున ఆడాడు. ఇదిలా ఉండగా సురేష్ రైనా(Suresh Raina) ఇప్పుడు రిటైర్ అయ్యాడు. కామెంట్రీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆదివారం ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తాను మళ్లీ ఐపీఎల్‌లోకి తిరిగి రావడం గురించి కీలక విషయం చెప్పాడు. అయితే ఈ విషయం తనకు తెలియదని చెన్నై కోచ్ అన్నారు.సీఎస్కే ఐపీఎల్-2025లో అంత గొప్పగా రాణించలేదు. ఈ జట్టు ఈ సీజన్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై(Chennai) చివరి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఇప్పుడు వచ్చే సీజన్‌లో విజయవంతమైన పునరాగమనం చేయాలని సీఎస్కే చూస్తోంది.
సమావేశం
చెన్నై, గుజరాత్ మ్యాచ్ సందర్భంగా వచ్చే సీజన్‌లో చెన్నైకి తిరిగి రావచ్చని , చెన్నై జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా రానున్నట్లు పేర్కొన్నాడు. అయితే చెన్నై స్పిన్ బౌలంగ్ కోచ్ ఎస్.శ్రీరామ్(S.Shriram)ను దీని గురించి అడిగినప్పుడు తనకు దీని గురించి ఏమీ తెలియదని అన్నాడు. “నాకు తెలియదు. అతను అలా చెప్పి ఉంటే మనం అతడినే అడగాలి” అని గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీరామ్ అన్నాడు.ప్రస్తుతం ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ మైక్ హస్సీ(Mike Hussey) చెన్నై బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. మైక్ హస్సీ కూడా చాలా కాలం చెన్నై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కూడా మైక్ హస్సీ చెన్నైని వదిలి వెళ్లలేదు. బ్యాటింగ్ కోచ్‌గా తిరిగి వచ్చాడు. సురేష్ రైనా చెన్నైకి తిరిగి వస్తాడా లేదా అనేది వచ్చే సీజన్‌లోనే తెలుస్తుంది.
భవిష్యత్తు
వచ్చే సీజన్ వేలానికి ముందు చెన్నై చాలా మార్పులు చేయవచ్చు. ఈ సీజన్‌లో బాగా రాణించని, ఎటువంటి సామర్థ్యాన్ని చూపించని చాలా మంది ఆటగాళ్లను సీఎస్కే(CSK) విడుదల తీసేయవచు. అదే సమయంలో మెరుగైన భవిష్యత్తు కోసం ఆశలు పెట్టుకున్న కొంతమంది యువ ఆటగాళ్లను నిలుపుకునే ఛాన్స్ ఉంది. వీటిలో ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి పేర్లు ఉంటాయి.
Read Also: French Open 2025: మహిళల సింగిల్స్ లో గెలుపొందిన పౌలా బడోసా