ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.14 ఏళ్లకే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. తన ఐపీఎల్ అరంగేట్రం తొలి బంతికే సిక్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి మ్యాచ్‌లో వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంత చిన్న వయస్సులోనే తన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తన చిన్న ఇన్నింగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వైభవ్ బ్యాటింగ్‌కు మంత్రముగ్ధుడయ్యాడు.ఆర్సీబీపై వైభవ్ ఫియర్‌లెస్ బ్యాటింగ్ ను చూసిన సురేష్ రైనా ఒక పాట పాడటం ప్రారంభించాడు. వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే అని కానీ అతని స్వభావం, నిర్భయమైన శైలి, ఆటను అర్థం చేసుకోవడం, ప్రశాంతమైన శరీర భాష వైభవ్ అనుభవజ్ఞుడైన ఆటగాడని చూపిస్తాయని సురేష్ రైనా అన్నాడు. వైభవ్ ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని ఎప్పుడూ భయపడడంటూ చెప్పుకొచ్చాడు.
పిన్న వయస్కుడిగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంసీ 12 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో వైభవ్ 2 సిక్సర్లు కూడా కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని తమ జట్టులోకి రూ.1.1 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలిసిందే. ఈ విధంగా వైభవ్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
కెరీర్
వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. వైభవ్ కంటే ముందు ఈ రికార్డు ప్రేయాస్ రే బర్మాన్ పేరిట నమోదైంది. అతను 2019 సంవత్సరంలో 16 సంవత్సరాల 157 రోజుల వయస్సులో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉండగా వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన కెరీర్‌లోని మొదటి బంతికే సిక్స్ కొట్టిన 10వ బ్యాటర్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.వైభవ్ పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎవరైతే వైభవ్ స్కూల్ గురించి ట్రోల్ చేశారో వాళ్లు ఇప్పుడు 9వ తరగతిలో ఉన్నారు. కానీ అతను ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.
Read Also: Danish Kaneria: పాక్‌లో పహల్గాం బాధితుల పరిస్థితే నాది కూడా: డానిష్ కనేరియా