ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా,సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్) చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు(Play Off Race) నుంచి తప్పుకుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేదు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 2 పాయింట్స్‌ను ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పోతు పోతు లక్నోను కూడా తమ వెంట తీసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), ఎయిడెన్ మార్క్‌రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) దూకుడుగా ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/28) రెండు వికెట్లు తీయగా హర్ష్ దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు తలో వికెట్ తీసారు.అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించగా ఇషాన్ కిషన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), కామిందు మెండీస్(21 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి(2/37) రెండు వికెట్లు తీయగా విల్ ఓ రూర్కీ, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసారు.

హాఫ్ సెంచరీ
206 పరుగుల భారీ లక్ష్యచేధనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. యువ ప్లేయర్ అథర్వ టైడ్(13) తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓరూర్కీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(Ishan Kishan)తో కలిసి అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేసాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలోనే ఆరెంజ్ ఆర్మీ వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న దిగ్వేష్ రతిని పెవిలియన్ కి పంపాడు. దాంతో రెండోవికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి వచ్చిన హెన్రీ క్లాసెన్, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడారు. కిషన్‌ను దిగ్వేష్ రతి క్లీన్ బౌల్డ్ చేశాడు. కామిందు మెండిస్‌తో కలిసి క్లాసెన్ ఇన్నింగ్స్(Innings)ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి బౌండరీలు బాదడంతో మ్యాచ్‌పై సన్‌రైజర్స్ పట్టు బిగించింది. హాఫ్ సెంచరీకి చేరువైన హెన్రీచ్ క్లాసెన్‌ను శార్దూల్ ఠాకూర్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ కి పంపాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కామిందు మెండీస్ తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలు విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.
Read Also : BCCI: ఆసియా కప్ నుంచి భారత్ అవుట్..కారణాలేంటి?