📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sourav Ganguly: రాజకీయాలపై ఆసక్తి లేదు: గంగూలీ

Author Icon By Anusha
Updated: June 22, 2025 • 5:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రత్యేక ఇంటర్వ్యూలో

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ, “గంభీర్ ఒక ముక్కుసూటి మనిషి. తాను నమ్మిన విలువలపై కట్టుబాటుతో ముందుకెళ్తాడు. అలాంటి వ్యక్తి జట్టును రిజల్ట్ దిశగా నడిపిస్తాడు” అని పేర్కొన్నారు.గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జట్టులో కొత్త ఎనర్జీ, బాధ్యతాయుతమైన ఆటతీరు కనిపిస్తోందని గంగూలీ (Ganguly) అభిప్రాయపడ్డాడు. గతంలో కేకేఆర్ (IPL) టీంలో మెంటార్‌గా పనిచేసిన సమయంలో గంభీర్ చూపిన నాయకత్వ గుణాలు, ఆటగాళ్లపై ప్రభావం, అతని బలమైన ఫైటింగ్ స్పిరిట్ ఇప్పుడు భారత జట్టుకూ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

సమయం దొరకలేదు

సీఎం పదవి ఇచ్చినా రాజకీయాల్లోకి వెళ్లనని స్పష్టం చేశాడు.’అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత నేను విభిన్న పాత్రలను పోషించాను. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్)‌ అధ్యక్షుడిగా బీసీసీఐ ప్రెసిడెంట్‌ (BCCI President) గా బాధ్యతలు చేపట్టాను. దాంతో కోచ్‌గా పనిచేసేందుకు నాకు సమయం దొరకలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం నా వయసు 50 ఏళ్లు మాత్రమే. కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఏం జరుగుతుందో చూడాలి.గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాణిస్తున్నాడు. అతను తన ప్రయాణాన్ని నెమ్మదిగా ప్రారంభించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ల్లో పరాజయాలను ఎదుర్కొన్నాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు.

Sourav Ganguly

గొప్ప ఆటగాడు

ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ అతని కోచింగ్‌కు కీలకం కానుంది. గంభీర్‌తో నాకు అంతగా చనువు లేదు. కానీ ఆట పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి. అతని వ్యూహాలను కూడా నేను దగ్గరగా చూడలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అతనితో నేను పనిచేయలేదు. అతనితో కలిసి ఆడాను.గంభీర్ (Gambhir) గొప్ప ఆటగాడు. మేం కలిసి ఆడేటప్పుడు అతను నాకు చాలా గౌరవం ఇచ్చేవాడు. సీనియర్ల పట్ల మర్యాదగా ఉండేవాడు. ప్రస్తుతం కోచ్‌గా అతను చాలా కసితో ఉన్నాడు. అతను ముక్కుసూటి మనిషి. ఏదైనా ముఖం మీదే చెప్పేస్తాడు. అతను కోచ్‌గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా.

అతని పర్యవేక్షణలో

అయితే అందరిలానే అతను కూడా ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు. అతనికి కాస్త సమయం ఇవ్వాలి’అని గంగూలీ చెప్పుకొచ్చాడు.సౌరవ్ గంగూలీ ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌ (Mentor) గా వ్యవహరించాడు. అతని పర్యవేక్షణలోని ఢిల్లీ మహిళల టీమ్ ఫైనల్ చేరి ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైంది. రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి తనకు లేదని గంగూలీ స్పష్టం చేశాడు. సీఎం పదవి ఇచ్చినా రాజకీయాల్లోకి వెళ్లనని తెలిపాడు.

Read Also: Jasprit Bumrah: బుమ్రా , గంభీర్ మధ్య వాగ్వాదం.. కారణం ఏంటో తెలుసా?

#GangulyOnGambhir #GautamGambhir #SouravGanguly #TeamIndiaCoach Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.