📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Shubhman Gill: హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్న శుభ్‌మన్ గిల్

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)తో విభేదాలున్నాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై గిల్ స్పందిస్తూ, తనకు హార్దిక్‌తో ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేశాడు. “సోషల్ మీడియాలో చూసిన ప్రతీ విషయం నిజం కాదు. దయచేసి అసత్య వార్తల్ని నమ్మొద్దు” అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

పట్టించుకోకుండా

కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఈ మ్యాచ్ సందర్భంగా శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఒకరినొకరు చూసుకోకపోవడం, విష్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. టాస్ సందర్భంగా ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా(Social media)లో జోరుగా ప్రచారం జరిగింది. హార్దిక్ పాండ్యా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా గిల్ పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోయాడని, ఆ తర్వాత గిల్ ఔటైనప్పుడు హార్దిక్ దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వైరల్ చేశారు. దాంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది భావించారు.

Shubhman Gill: హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్న శుభ్‌మన్ గిల్

అనుబంధం

టీమిండియా కెప్టెన్సీ విషయంలో ఇద్దరి ఇగో క్లాష్ మొదలైందని చాలా మంది అనుకున్నారు. అయితే, ఈ ప్రచారంపై శుభ్‌మన్ గిల్ స్పందించాడు. హార్దిక్ పాండ్యాతో మంచి అనుబంధం, ప్రేమ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాడు.ఇంటర్నెట్‌లో చూసే ప్రతీది నమ్మవద్దు’ అభిమానులను కోరాడు.రోహిత్ శర్మ(Rohit Sharma) వారసుడిగా శుభ్‌మన్ గిల్‌‌కు టీమిండియా టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనతో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన గుజరాత్ టైటాన్స్ కీలక ఎలిమినేటర్‌లో ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా గుజరాత్‌కు విజయం దక్కలేదు.

Read Also: Singapore Open 2025: సింగపూర్‌ ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ ఓటమి

#GujaratTitans #HardikPandya #IPL2025 #ShubmanGill Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.