📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

PBKS vs DC: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ,ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ప్లేఆఫ్స్‌ బెర్తులు దక్కించుకున్న జట్లకు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ షాక్‌ ఇవ్వగా, తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ టాప్‌ ప్లేస్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) నీళ్లు గుమ్మరించింది. ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళుదామనుకున్న పంజాబ్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.పంజాబ్‌ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.3 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. సమీర్‌ రిజ్వి(25 బంతుల్లో 58 నాటౌట్‌, 3ఫోర్లు, 5సిక్స్‌లు), కరణ్‌నాయర్‌(44), కేఎల్‌ రాహుల్‌(35) రాణించారు. బ్రార్‌(2/41)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్య ర్‌(34 బంతుల్లో 53, 3ఫోర్లు, 2సిక్స్‌లు), స్టొయినిస్‌(16 బంతుల్లో 44 నాటౌట్‌, 3ఫో ర్లు, 4సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 206/8 స్కోరు చేసింది.

పరుగులు

ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/33) మూడు వికెట్లు తీయగా విప్రజ్ నిగమ్(2/38), కుల్దీప్ యాదవ్(2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ముఖేష్ కుమార్‌(Mukesh Kumar)కు ఓ వికెట్ దక్కింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 నాటౌట్), కరుణ్ నాయర్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/41) రెండు వికెట్లు తీయగా మార్కో జాన్సెన్, ప్రవీన్దూబే చెరో వికెట్ పడగొట్టారు.

PBKS vs DC: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?

బౌలింగ్

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్ పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని తెలిపాడు.’ఈ పిచ్‌పై 207 అద్భుతమైన స్కోర్. ఈ వికెట్‌పై వేరియేబుల్ బౌన్స్ ఉంది. అంతేకాకుండా బంతి వేగంలో వ్యత్యాసం ఉంది. మేం క్రమశిక్షణతో బౌలింగ్ చేయలేదు. మేం ఈ పిచ్‌కు తగ్గట్లు స్టంప్స్‌ లైన్‌లో హార్డ్ లెంగ్త్‌(Hard length on the stumps line)లో బంతిని హిట్ చేయాలనుకున్నాం. కానీ వికెట్లు తీయాలనే ప్రయత్నంలో ఎక్కువ బౌన్సర్లు వేసాం.ఈ టోర్నీలో ప్రతీ జట్టు బలంగానే ఉంటుంది. సానుకూలంగా, ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మేం పటిష్టమైన ప్రణాళికలతో తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాం. నాకు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. కేవలం వేలికి చిన్నగాయమైంది. తదుపరి మ్యాచ్‌కు నయమవుతోంది.’అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Read Also: PBKS vs DC: పంజాబ్‌ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

#CricketInterview #IPL2025 #PitchReport #PostMatchReaction #ShreyasIyer Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.