📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: May 30, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో గురివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. ప్రియాన్ష్ ఆర్య(7), ప్రభ్ సిమ్రాన్ సింగ్(18)తో పాటు జోష్ ఇంగ్లీస్(4), శ్రేయస్ అయ్యర్(2), నెహాల్ వధేరా(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), సుయాశ్ శర్మ(3/17) మూడేసి వికెట్లు తీయగా యశ్ దయాల్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar), రొమారియో షెపెర్డ్‌కు చెరో వికెట్ దక్కింది.

అవకాశం

అనంతరం ఆర్‌సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఫిల్ సాల్ట్(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా రజత్ పటీదార్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, ముషీర్ ఖాన్(Mushir Khan) చెరో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ ఫైనల్ చేరగా క్వాలిఫయర్-2 రూపంలో పంజాబ్ కింగ్స్‌కు మరో అవకాశం ఉంది. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడకుండా ఫియర్‌లెస్ గేమ్ అంటూ అనవసర షాట్లతో పంజాబ్ కింగ్స్ మూల్యం చెల్లించుకుంది.

Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?

బ్యాటింగ్‌

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పాడు. ఈ మ్యాచ్ వైఫల్యంపై అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డాడు.బ్యాటింగ్‌ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడటంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని తెలిపాడు.’ఇది మర్చిపోలేని రోజు. అయితే మేం మళ్లీ మొదటి నుంచి మా ప్రణాళికలను రచించుకోవాలి. మా బ్యాటింగ్ సమయంలో మేం వరుసగా వికెట్లు కోల్పోయాం.ఈ ఓటమి నేపథ్యంలో చాలా విషయాలను మేం అధ్యయనం చేయాలి. ఇంపాక్ట్ ప్లేయర్(Impact player) విషయంలో మేం ఎలాంటి తప్పిదం చేయలేదు. నిజం చెప్పాలంటే నా నిర్ణయాలపై నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రణాళిక పరంగా మేము ఏది చేసినా మైదానం బయట మేం ఏ వ్యూహాలు రచించినా అవి సరైనవేనని నేను భావిస్తున్నాను. కేవలం మేం మా వ్యూహాలను మైదానంలో అమలు చేయలేకపోయాం.తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేయాల్సి వచ్చినందున బౌలర్లను కూడా నిందించలేం. మేం బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా ఈ పిచ్‌పై వర్క్ చేయాల్సి ఉంది.అయితే వీటిని మేం సాకులుగా చెప్పలేం. ఎందుకంటే మేం ప్రొఫెషనల్ ఆటగాళ్లం. మేం పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సింది. అయితే మేం యుద్దంలో ఓడిపోలేదు ఈ పోరులో మాత్రమే ఓడిపోయాం.’అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

Read Also: Phil Salt: ఫిల్ సాల్ట్ బ్యాటింగ్‌కు నేను పెద్ద అభిమానిని: రజత్ పటీదార్

#BattingFailure #IPL2025 #PunjabKings #RCBvsPBKS #ShreyasIyer Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.