📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Ricky Ponting: రికీ పాంటింగ్ వల్లే ఈ విజయం: శ్రేయస్ అయ్యర్

Author Icon By Anusha
Updated: May 27, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్లతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్‌ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రికీ పాంటింగ్‌తో పాటు తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.పంజాబ్ కింగ్స్(Punjab Kings) హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వల్లే తమ జట్టు క్వాలిఫయర్-1కు అర్హత సాధించిందని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కెప్టెన్‌గా పాంటింగ్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని, తెరవెనుక ఉండి తనను నడిపించాడని తెలిపాడు. 

నమ్మకం

‘జట్టులోని ప్రతి ఒక్కరూ సరైన సమయంలో పుంజుకున్నారు. తొలి మ్యాచ్‌ నుంచే పరిస్థితులు ఎలా ఉన్నా గెలవాలనే కసితో ఆడాం. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నారు. సపోర్ట్ స్టాఫ్‌తో పాటు మేనేజ్‌మెంట్‌కు అభినందనలు. ఆటగాళ్లను రికీ పాంటింగ్(Ricky Ponting అద్భుతంగా చూసుకున్నాడు. ఆరంభంలోనే విజయాలు దక్కడంతో ఆటగాళ్లపై నమ్మకం ఏర్పడింది. జట్టులోని ప్రతీ ఆటగాడితో మాట్లాడాను. కెప్టెన్‌గా ఆటగాళ్లతో మంచి సంబంధం ఉండాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉంది. ఆరుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లతో మేం విజయాలు సాధించాం. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య అద్భుతమైన ఆరంభాలు అందించాడు.

Punjab Kings: అయ్యర్‌ కృషి తోనే పంజాబ్ కింగ్స్ గెలిచింది: రికీ పాంటింగ్

ఫలితం

కుర్రాళ్లంతా ఫియర్‌లెస్‌గా ఉన్నారు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తారు. ఆ సన్నాహకాల ఫలితం ఇప్పుడు మైదానంలో కనబడుతోంది. ఇంగ్లిస్(Englis) కు మాత్రమే స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ లేదు. అతను కొత్త బంతిని ఆడటానికి ఇష్టపడుతాడు. అతను మరిన్ని కొత్త బాల్స్ ఆడాలని భావించే, నా కంటే ముందు బ్యాటింగ్ పంపించాం. ఈ ప్రయోగం ఫలించింది. అతను విధ్వంసకరమైన ఆటగాడని, మంచి ఇంటెట్‌తో ఆడగలిగే బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మాకు తెలుసు. గత కొన్నేళ్లుగా రికీ పాంటింగ్‌తో నాకు స్నేహం ఉంది. అతను నాకు చాలా స్వేచ్ఛను ఇస్తాడు. బయటి నుంచి వ్యూహాలు అమలు చేయాలని నేను రికీకి చెబుతాను. అతను చెప్పిన చిట్కాలను మైదానంలో అమలు చేస్తాను.’అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Read Also : Punjab Kings: అయ్యర్‌ కృషి తోనే పంజాబ్ కింగ్స్ గెలిచింది: రికీ పాంటింగ్

#IPL2025 #PunjabKings #RickyPonting #ShreyasIyer Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.