📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

ఆమె క్రికెట్ లోకానికి ఓ స్ఫూర్తి

Author Icon By Vanipushpa
Updated: February 12, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆడపిల్ల అని చెత్తబుట్టలో పడేశారు తల్లిదండ్రులు. ఆ క్షణం వాళ్లకు భారం ఆ పసికందు. కానీ అదే పసి ప్రాణం మరో కుటుంబానికి వరంగా మారింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. తల్లిదండ్రులు కని చెత్తబుట్టలో పడేస్తే.. ఓ అనాథ శరణాలయం పెంచింది. ఓ ఆస్ట్రేలియన్ కుటుంబం ఆమెను దత్తత తీసుకుంది. అక్కడే పెరిగి పెద్దదై క్రికెట్ లో రాణిస్తూ.. ఏకంగా ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. ICC క్రికెటర్ అవార్డునూ అందుకుంది.
ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ ను మహారాష్ట్ర పుణెలోని శ్రీవాస్తవ అనాథ శరణాలయం వద్ద ఉన్న చెత్త కుండీలో దొరికింది. అనాథ శరణాలయంలోనే ఆమె పెరిగింది. ఆమెకు శరణాలయం సిబ్బంది లైలా అనే పేరును పెట్టారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆస్ట్రేలియా నుంచి హరెన్, స్యూ అనే భార్యాభర్తలు పుణెలోని ఈ అనాథ శరణాలయానికి వచ్చారు. వారు ఒక అబ్బాయిని దత్తత తీసుకోవడానికి వచ్చారు. అయితే అక్కడే ఉన్న లైలా.. ఆమె బ్రౌన్ కళ్లు,కల్మశం లేని ముఖం.. వాళ్లను ఆకర్షించింది. ఆ తర్వాత చట్టపరమైన విధివిధానాలు అన్ని పూర్తిచేసి.. ఆ దంపతులు లైలాను ఆస్ట్రేలియా తీసుకెళ్లారు.

ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత లైలా పేరును లీసా అని మార్చారు తల్లిదండ్రులు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆ కుటుంబం అమెరికాలో గడిపి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడింది. లీసా తన తండ్రి హరెన్ వద్ద క్రికెట్ నేర్చుకుంది. పార్కులో అబ్బాయిలతోనూ రోజూ క్రికెట్ ఆడుతూ ఉండేది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తండ్రి హరెన్.. లీసాను ప్రోత్సహించాడు. దీంతో లీసా క్రికెట్ పై పూర్తిగా దృష్టి సారించింది. 1997లో లీసా తన మొదటి మ్యాచ్ సౌత్ వేల్స్ 2001 జట్టు తరఫున ఆడింది.

అంతర్జాతీయ స్థాయికి ఎదుగుదల

రాష్ట్ర స్థాయిలో గొప్ప ప్రదర్శన ఇచ్చిన తర్వాత, ఆమె జాతీయ జట్టుకు ఎంపికైంది. అక్కడ కూడా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరచి, టీమ్లో కీలక సభ్యురాలిగా మారింది. అంతర్జాతీయ మ్యాచ్‌లలో అనేక రికార్డులు నెలకొల్పి, మహిళా క్రికెట్‌ను గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషించింది.

స్ఫూర్తిదాయక క్రీడా ప్రయాణం

ఆమె నమ్మకంతో, కృషితో, పట్టుదలతో సాధించిన విజయాలు ఎంతోమందికి ప్రేరణగా మారాయి. క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకోవాలనుకునే యువతులకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

మహిళా క్రికెట్ అభివృద్ధిపై ఆమె అభిప్రాయం

ఆమె గేమ్ మాత్రమే కాదు, మహిళా క్రికెట్ కోసం సరైన అవకాశాలు రావాలని, ప్రోత్సాహం పెరగాలని ఎన్నో మార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యువతికి ప్రోత్సాహాన్ని అందించేలా ఆమె తన అనుభవాలను పంచుకుంటుంది.

భవిష్యత్ లక్ష్యాలు

ఆమె గేమ్‌లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్రీడాభివృద్ధి కోసం ఆమె చేస్తున్న కృషి మరింత మంది అమ్మాయిలకు స్పూర్తిగా మారుతోంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu inspiration Latest News in Telugu lisa sthalekar Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news world of cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.