📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Shashank Singh: శ్రేయస్ అయ్యర్ పై శశాంక్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: June 8, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ గెలిచిన తర్వాత తమ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్‌పై మైదానంలో సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత శశాంక్ సింగ్ ఈ సంఘటనపై స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించాడు. శశాంక్ సింగ్ తండ్రి కూడా మ్యాచ్ తర్వాత తన కోపాన్ని వ్యక్తం చేశారు.ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో శశాంక్ సింగ్(Shashank Singh) కష్టకాలంలో తన తప్పు కారణంగా రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మ్యాచ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అసహనాన్ని వెళ్లగక్కాడు. మ్యాచ్ అనంతరం శశాంక్ సింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు శ్రేయస్ అయ్యర్ వద్దకు వచ్చినా పట్టించుకోలేదు. తాజాగా ఈ విషయంపై శశాంక్ సింగ్ స్పందించాడు. ఆ కీలక మ్యాచ్‌లో తాను ఘోర తప్పిదం చేశానని శశాంక్ అంగీకరించాడు. ఆసమయంలో శ్రేయస్ తనను చెంపదెబ్బ కొట్టాల్సిందని అభిప్రాయపడ్డాడు.

బీచ్‌లో నడిచినట్లు

ఈ సంఘటనపై శశాంక్ తన స్పందన తెలియజేస్తూ ఓ ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు. ” నిర్లక్ష్యంగా పరిగెత్తి నేను తప్పు చేశాను. శ్రేయస్ అయ్యర్ నన్ను చెంపదెబ్బ కొట్టి ఉండాల్సింది. మా నాన్న కూడా నాపై సీరియస్ అయ్యాడు. ఫైనల్ వరకు నాతో మాట్లాడలేదు. నానే చాలా క్యాజువల్ గా పరిగెత్తాను. తోటలో నడిచినట్లు కూడా కాదు బీచ్‌లో నడిచినట్లు పరిగెత్తుకుంటూ వెళ్లాను. అది చాలా కీలకమైన సమయమని ఇది నీ నుంచి ఊహించలేదని శ్రేయస్(Shreyas Iyer) నాతో అన్నాడు. కానీ తర్వాత శ్రేయస్ నన్ను డిన్నర్‌కు తీసుకెళ్లాడు.” అని శశాంక్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఇన్నింగ్స్‌

ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ జరిగింది. ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసిది. బదులుగా పంజాబ్ కింగ్స్ జట్టు 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో శశాంక్ సింగ్ చివరి ఓవర్ వరకు పోరాడాడు. శశాంక్ 30 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత కూడా శశాంక్ సింగ్ తన జట్టును మొదటి సారి ఐపీఎల్ ఛాంపియన్ చేయలేకపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో శశాంక్ సింగ్ 6 సిక్సర్లు కొట్టాడు.

Read Also: Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం వీడ్కోలు?

#OwnsTheMistake #Shashank Singh #ShreyasCalledItOut #ToughLoveOnField Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.