📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Shane Watson: ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందన్న షేన్ వాట్సన్

Author Icon By Anusha
Updated: May 30, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా,గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో(10 ఓవర్లు మిగిలుండగానే) పంజాబ్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది.ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్‌ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ(RCB) అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది. 9 ఏళ్ల తర్వాతా ఫైనల్ చేరిన ఆర్‌సీబీ 18 ఏళ్ల తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఊహించని ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మారో అవకాశం ఉంది.ఆర్‌సీబీ ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆర్‌సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. 

హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings) 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(7), ప్రభ్ సిమ్రాన్ సింగ్(18)తో పాటు జోష్ ఇంగ్లీస్(4), శ్రేయస్ అయ్యర్(2), నెహాల్ వధేరా(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), సుయాశ్ శర్మ(3/17) మూడేసి వికెట్లు తీయగా యశ్ దయాల్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపెర్డ్‌(Romario Shepherd)కు చెరో వికెట్ దక్కింది.అనంతరం ఆర్‌సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఫిల్ సాల్ట్(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా రజత్ పటీదార్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసారు.

Shane Watson: ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందన్న షేన్ వాట్సన్

ఆల్‌రౌండర్

ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంటుందని షేన్ వాట్సన్ పేర్కొన్నారు. ఐపీఎల్ ఫైనల్‌‌లో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(Man of the Match Award)ను గెలుచుకుంటాడని మాజీ ఆర్సీబీ ఆల్‌రౌండర్ అంచనా వేశాడు.ఖచ్చితంగా ఈ సారి ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా రాణిస్తుండడంతో ఈ ఏడాది ఆర్సీబీదేనని తాను భావిస్తున్నానని షేన్ వాట్సన్(Shane Watson) అన్నాడు.ఐపీఎల్ లీగ్ దశ ముగింపులో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ 9 మ్యాచ్‌లను గెలవగా 4 ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ జట్టు 228 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. అద్భుతమైన ఘనతను సాధించింది.

Read Also: Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?

#IPL2025 #ManOfTheMatch #RCBChampions #ShaneWatson #ViratKohli Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.