📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Shahid Afridi: పీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ షాహిద్ అఫ్రిది డిమాండ్

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో పాకిస్థాన్ జట్టు నిరుత్సాహకర ప్రదర్శన చేసిన తర్వాత, మాజీ పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ఈ విషయంలో తీవ్రమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ఖాతా, మీడియా ఇంటర్వ్యూలలో అఫ్రిది పీసీబీ ఛైర్మన్ మోహ్‌సీన్ నఖ్వీ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించలేదని నేరుగా విమర్శించారు.

Mohsin Naqvi: సారీ.. కప్పు కావాలంటే అక్కడికి రావాల్సిందే

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ బాధ్యతల నుంచి మోహ్‌సీన్ నఖ్వీ (Mohsin Naqvi) తప్పుకోవాలని ఆ జట్టు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది డిమాండ్ చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వైఫల్యం నేపథ్యంలో అఫ్రిది ఈ ప్రతిపాదన చేశాడు. పాకిస్థాన్ మంత్రిగా.. పీసీబీ ఛైర్మన్‌గా నఖ్వీ న్యాయం చేయలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు.

పాకిస్థాన్ క్రికెట్‌‌పై ప్రత్యేక శ్రద్ద చూపే ఛైర్మన్ కావాలని అఫ్రిది నొక్కి చెప్పాడు.ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు భారత్ చేతిలో ఘోర పరాజయాలను ఎదుర్కొంది. భారత్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లకు మూడింటిని పాకిస్థాన్ (Pakistan) ఓడిపోయింది. ఫైనల్లో పోటీ ఇచ్చినా తొలి రెండు మ్యాచ్‌ల్లో చిత్తయ్యింది.

Shahid Afridi

పీసీబీ ఛైర్మన్‌గా నఖ్వీ న్యాయం చేయలేకపోతున్నాడని

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) ప్రెసిడెంట్‌గా కూడా నఖ్వీ వ్యవహరిస్తున్నాడు. కీలక పదవుల్లో ఉన్న నఖ్వీ పూర్తిగా సలహాదారుపై ఆధారపడుతున్నాడని అఫ్రిది ఆరోపించాడు.’పీసీబీ ఛైర్మన్, పాకిస్థాన్ మంత్రి అయిన మోహ్‌సిన్ నఖ్వీ సాబ్‌కు నా అభ్యర్థన, సలహా ఏంటంటే.. పీసీబీ ఛైర్మన్ బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తప్పుకోవాలి.

పీసీబీ అనేది పాకిస్థాన్ మంత్రిత్వ శాఖ కంటే పూర్తిగా భిన్నమైనది. కాబట్టి పీసీబీకి ఆయన దూరంగా ఉండాలి. పాకిస్థాన్ క్రికెట్‌ (Pakistan Cricket) కు ప్రత్యేక శ్రద్ద, సమయం కేటాయించే వ్యక్తి అవసరం. నఖ్వీ పూర్తిగా సలహాదారులపైనే ఆధారపడుతున్నారు.

ఈ సలహాదారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. క్రికెట్ గురించి తెలియదని ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి ఆట గురించి తెలిసిన వ్యక్తులను పీసీబీ ఛైర్మన్‌గా, సలహాదారులుగా నియమించాలి.’అని అఫ్రిది విజ్ఞప్తి చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Afridi demand Asia Cup 2025 Breaking News Cricket Administration latest news Mohsin Naqvi Pakistan Cricket Board Pakistan cricket failure PCB Chairman Shahid Afridi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.